జగన్ తో జాగ్రత్తగా ఉండాలంటూ -సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలకే కాదు, రాష్ట్ర ప్రజలకూ పదేపదే చెప్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన చంద్రబాబే ఇటీవలి కాలంలో అన్నిసార్లు జాగ్రత్తలు చెప్తున్నారంటే-కొన్ని క్షణాలు ఆగి ఆలోచించాలి. జగన్ తో జాగ్రత్తగా ఉండాలంటూ -సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలకే కాదు, రాష్ట్ర ప్రజలకూ పదేపదే చెప్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన చంద్రబాబే ఇటీవలి కాలంలో అన్నిసార్లు జాగ్రత్తలు చెప్తున్నారంటే -కొన్ని క్షణాలు ఆగి ఆలోచించాలి. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్కు విపక్ష హోదా కూడా దక్కలేదన్నది. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగని -జగజ్జెంత్రీ విషయంలో ఉదాశీనంగా ఉండకూడదన్నది ముఖ్యమంత్రి మాట. ఎందుకూ అంటే -క్రిమినాలజీలో ఆరితేరిన జగన్రెడ్డి రాజకీయం రొటీన్కు కాస్త భిన్నం. అలవోకగా అబద్ధాలు చెప్పడంలో ఆయన దిట్ట. జగన్ మనస్తత్వాన్ని అంచనా వెయ్యడం రాజకీయాలలో తలపండిన ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యం కాలేదు. ఎంత పెద్ద నేరం చేసినా దానిని ఎదుటివారిపైకి సమర్థంగా నెట్టడం జగన్రెడ్డి వంటబట్టించుకున్న ప్రత్యేక లక్షణం, రాక్షస మూకలను చేరదీసి.. వైసీపీ అనే రాజకీయ పార్టీ పేరిట రాష్ట్రంలో స్వైర విహారం చేసి.. ఇప్పుడు ఆ మూకను బతకనివ్వకుండా కూటమి సర్కారు.
దాడులకు తెగబడుతోందని సులువుగా చెప్పేయడం జగన్క సాధ్యమైంది. జగన్ నయవంచక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడిన ఘట్టాలు రాష్ట్ర ప్రజలకు తెలింది కాదు. అరాచకాలలో జగన్ నేర్పరి. నేరంచేసి దాన్ని ఎదుటివారిపై నెట్టేయడం ఆయన సహజ నైజమని గ్రహించారు కనుకే.. ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రతి సమావేశంలో జాగ్రత్తలు చెప్పాల్సి వస్తుంది. చంద్రబాబు జాగ్రత్త హెచ్చరికలు పార్టీ నేతలకే కాదు, మరోసారి మోసపోవద్దని ప్రజలకూ చెప్తున్నదే!
ముఖ్యమంత్రి హోదా వెలగబెట్టిన జగన్రెడ్డి.. ఇంత దిగజారి మాట్లాడటం, ప్రవర్తించడాన్ని చూసి జనం ఛీ కొడుతున్నారు. గతంలో ఇంతటి గతిమాలిన రాజకీయాలు చేసిన ఏ వ్యక్తినీ చూడలేదనీ మాట్లాడుకుంటున్నారు. గత నెలలో నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్ మాటలు విన్న ఎవరైనా ఇలా అనుకోవడంలో అతిశయోక్తి ఏమీ ఉండదు. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడేనా? అన్నదే ప్రశ్న. మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిధున్రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చెయ్యడంపై కొత్త కథ అల్లడం జగన్కే సాధ్యమైంది. వాస్తవాలు బయటపడితే పరువు పోతుందన్న ఇంగితం కూడా లేకుండా.. ఎప్పుడో 53 ఏళ్ల కిందట కాలేజీ గొడవల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుతో కొట్టాడని, ఆ కక్ష తీర్చుకోవడానికే ఇప్పుడు అతని కొడుకు మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని జగన్రెడ్డి చెప్పిన కథ సినిమాల్లో కూడా చూడం.
మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్రెడ్డి ప్రమేయం, పాత్రపై ఆధారాలు లేకుండా అరెస్టు చెయ్యడం సాధ్యమా? ముఖ్యమంత్రి హోదా వెలగబెట్టిన జగన్కు ఆమాత్రం జ్ఞానం ఉండదా? ఇంగితంలేని ఇటువంటి పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం జగన్క సాధ్యమని చెప్పడానికి ఇదొక ఉదాహరణ, ఆమధ్య చంద్రబాబు, పెద్దిరెడ్డి 1972లో ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో వేర్వేరు గ్రూపులకు నాయకత్వం వహించేవారని, రెండు యూనియన్ల విద్యార్థుల మధ్య జరిగిన గొడవల్లో చంద్రబాబుపై పెద్దిరెడ్డి చేయి చేసుకున్నాడంటూ సాగించిన తప్పుడు ప్రచారం -జగన్ సహజ నైజానికి పరాకాష్ట కాకపోదు. ‘చంద్రబాబు యూనివర్సిటీలో మంచి స్కాలర్. మంచి ఎకనమిస్ట్ కూడా. ఎవరితోనూ గొడవలు పెట్టుకొనే మనస్థత్వం కాదు. కాలేజ్ రోజుల్లోనే చంద్రబాబు మంచి నాయకుడు. అటువంటి వ్యక్తిపై జగన్ రెడ్డి చిల్లర వ్యాఖ్యలు చేయడం.. జగన్ తన స్థాయిని తానే బయట పెట్టుకున్నట్టయ్యింది’ అంటూ ఆనాటి ఘట్టాలకు సాక్షి ప్రొఫెసర్ సుబ్రమణ్యనాయుడు కుండబద్ధలు కొట్టడం జగన్కు చెంపపెట్టు.
గట్టిగా మూడేళ్లు కళ్లు మూసుకొంటే కూటమి కనిపించదంటూ జగన్ నోరు పారేసుకోవడమూ అతని స్థాయిని అతనే దిగజార్చుకుంటున్నట్టు. ఏడాది కింద జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎవర్ని ఎగరగొట్టారో అందరికంటే జగన్కి బాగా తెలుసు. చంద్రబాబు ఎగిరిపోయే నాయకుడు కాదు, ప్రజలను ఎదిగించే నాయకుడంటూ ప్రజలే తీర్పు చెప్పినా.. జగన్ వాస్తవ ప్రపంచలోకి రాలేకపోవడం వైసీపీ చేసుకున్న ఖర్మ. చంద్రబాబును ఎగరగొట్టాలని చూసిన ఎందరో ఎగిరిపోయారన్న విషయం జగన్రెడ్డి గుర్తెరగాలి. చంద్రబాబు యోధాను యోధులతో రాజకీయంగా తలపడిన వ్యక్తి. ఆయన సమర్ధత, విలువ తెలియాలంటే రాజకీయ మరుగుజ్జు జగన్ ముందు చరిత్ర చదువుకోవాలి. చెన్నారెడ్డి, అంజయ్య, జనార్దన్రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్యలాటి ఉద్దండుల నుంచి ఇప్పటి వ్యర్థ ప్రేలాపకుల వరకూ చంద్రబాబు పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ళుగా అటువైపు అంతమంది మారితే, ఇటువైపు చంద్రబాబు ఒక్కడే. నిలబడి పోరాటం చేస్తున్నారు. ఎవరు ఎగిరిపోయిన నాయకులో చరిత్ర చదువుకోని జగన్ చెప్పడం -దెయ్యాలు వేదాలు వల్లించడంలాంటిదే. ఆనాడు వాజపేయి, అద్వానీ, జ్యోతిబసు, బిజూ పట్నాయక్, వీపీ సింగ్, దేవీలాల్, దేవగౌడ, గుజ్రాలవంటి ఎందరో ఉద్దండులతో కలిసి పనిచేసిన నాయకుడు చంద్రబాబు. చివరకు సైకో మనస్తత్వం కలిగిన జగన్ రెడ్డి వంటి అరాచక వ్యక్తితో రాజకీయం చేయాల్సి రావడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. ఆ విషయాన్ని ఇటీవలి కాలంలో చంద్రబాబే అనేక సందర్భాలలో ప్రస్తావించడాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే… బాబు దృష్టిలో జగన్ పిపీలకమన్న విషయాన్ని చెప్పక చెప్పడమే. గతంలో చంద్రబాబును ఫినిష్ చేస్తామని ప్రగల్బాలు పలికిన వారు కూడా ఏమైయ్యారో జగన్రెడ్డి తెలుసుకోవాలి.
ఒక్కసారి అధికారమిస్తే.. 30 ఏళ్ళు అధికారంలో వుంటానని ఎగిరెగిరిపడిన జగన్రెడ్డి ఎగిరిపోయి.. ఇప్పుడు ఎక్కడ వున్నాడో ప్రజలకు తెలింది కాదు. నోరుందని మిడిసి మిడిసిపడిన ఎందరో నేతలకు కాలం ఎలాంటి సమాధానం చెప్పిందో చెబుతుందో చరిత్ర చదువుకోని జగన్లాంటి వాళ్లకు తెలిసే అవకాశం ఉండదు. అది వేరే విషయం! ఇక పరామర్శల పేరిట జగన్రెడ్డి సాగించిన, సాగిస్తోన్న అరాచకాలకు హద్దులేకుండా పోయింది. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందనేది పరామర్శల్లో జగన్రెడ్డి ప్రవర్తనే పెద్ద ఉదాహరణ. జగన్ నేరమనస్తత్వంతో అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి పర్యటనల్లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. గుంటూరు పర్యటనలో జగన్ కారుకిందే పడి సింగయ్య మృతి చెందాడు. జగన్ కారు కింద పడి తన భర్త చనిపోయాడని సింగయ్య భార్య ఫిర్యాదు చేస్తే, కేసులో నిందితుడిగావున్న జగన్ సింగయ్య కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని, లోకేశ్ కోటి రూపాయలు ఇస్తానని ఆశ చూపారంటూ ఆమెతో తప్పుడు ఆరోపణలు చేయించారు. జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ జగన్ క్రిమినల్ ఆలోచనతో సొంత బాబాయు గొడ్డలితో నరికేసిన కేసును గుండెపోటుగా చిత్రీకరించారు. తర్వాత వాస్తవాలు బయటకు రావడంతో నేరాన్ని అప్పటి ముఖమంత్రి చంద్రబాబు పై నెట్టి రాజకీయ లబ్ది పొందాడు జగన్.
తాజాగా మామిడి, పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ ప్రజలను ఎంత పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారో చూసాం. ఒక సామాన్య రైతుని బెదిరించి రెండు ట్రాక్టర్లను గుంజుకొని వాటిలోని కాయలన్నిటినీ ఆయన కళ్ళముందే రోడ్డుపై పోసి మామిడి కాయలను ట్రాక్టర్తో తొక్కించి రైతులకు న్యాయం చెయ్యరా? అంటూ దీర్గాలు తీసిన టెంపరి జగన్ రెడ్డి. అయిదు నెలల క్రితం గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి కార్యకర్తలతో ఇష్టారీతిన మిరప బస్తాలను ఎక్కి తొక్కించి రైతుల కష్టాన్ని కాళ్ళతో తొక్కించారు. నల్ల బర్లీ పొగాకు కొనేందుకు ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చి కొనేందుకు మార్ఫెడ్ను రంగంలోకి దించింది. అయినా పొగాకు రైతుల పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పోయి పొగాకు బేళ్లను వైసీపి కార్యకర్తలతో తొక్కించారు. పొగాకు కొనే దిక్కులేదని రోత పత్రికలో రాతలు రాయించారు. అట్లాగే ఇటువంటి క్రిమినల్ నేరగాడు ప్రజాధనాన్ని ఎంత పకడ్బందీగా స్వాహా చేస్తారో దానికి మధ్యం స్కాంలో వెలువడుతున్న వాస్తవాలే ఉదాహరణ. జగన్ నైజం జనానికి తెలిసింది కనుకే -గత ఎన్నికల్లో దారుణ పరాభవ ఫలితాలిచ్చారు. ఆ విషయం ఇంకా జగనే జీర్ణించుకోవడం లేదు. అదీ అసలు ట్రాజెడీ!
మహాదేవ