- వారి సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.39 వేల కోట్లు
- నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత జౌళి మంత్రి సవిత
అమరావతి(చైతన్యరథం): సీఎం చంద్రబాబుతోనే వెనుకబడిన తరగతుల అభ్యు న్నతి సాధ్యమని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను బుధవారం నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌తో పాటు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లతానని తెలిపారు. అనంతరం నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన రుద్రకోటి సదాశివంను మంత్రి సవిత అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో బీసీలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.. నా ఎస్సీలు..నా ఎస్టీలు..నా బీసీలు అంటూ జగన్ అన్ని వర్గాల వారిని మోసగించా రు..
బీసీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారు.. కార్పొరేషన్ నిధులను మళ్లించి బీసీలకు స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు అందించలేదని మండిపడ్డారు. కుల వృత్తుల వారికి పనిముట్లు అందజేసే ఆదరణ పథకాన్ని నిలిపేశారన్నారు. వాటితో పాటు 2014-19లో నాటి చంద్రబాబు ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అమలు చేసి న పథకాలన్నింటినీ జగన్ రద్దు చేశారన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో బీసీలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు రూ.39 వేల కోట్లు కేటాయించారని వివరిం చారు. కార్పొరేషన్ ద్వారా నాయీబ్రాహ్మణుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వం అందజేసే పథకాలను అర్హులకు అందేలా కృషిచేయా లని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివంకు మంత్రి దిశా నిర్దే శం చేశారు. అనంతరం మంత్రి సవితను నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు సత్క రించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.