- గత ఐదేళ్లూ నిధులు, పదవుల్లో కోత పెట్టారు
- హాస్టళ్లను భ్రష్టు పట్టించి డైట్ చార్జీలు ఇవ్వలేదు
- ఓట్లు వేయించుకుని యువతను మోసగించారు
- బీసీల పక్షపాతి చంద్రబాబు నిధులు ఇచ్చారు
- ప్రతిఒక్కరూ వ్యాపారవేత్తలు కావాలన్నదే ఆశయం
- నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ల పెంపునకు చర్యలు
- యువత, మహిళలకు స్వయం ఉపాధికి శ్రీకారం
- బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖల మంత్రి సవిత
మంగళగిరి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల పక్షపాతి అని నిరూపిం చుకున్నారని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టి బీసీ ఫెడరేషన్‌లు ఏర్పాటు చేసి బీసీలకు పెద్దపీట వేశారు..బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు..ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చంద్ర బాబు బీసీలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. జగన్ అధికారంలోకి రాక ముందు నా బీసీలు, నా బీసీలు అని గొంతు చించుకుని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత రంగులు మార్చాడని మండిపడ్డారు. జగన్ వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఓట్లు వేయించుకుని ఆ తర్వాత యువతను మోసం చేశాడు..నా బీసీలు అని చెబుతూ హాస్టళ్లలో కనీస నిర్వహణ కోసం నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు బీసీలను అక్కున చేర్చుకున్నారు. జగన్‌ది అసమర్థ పాలన అయితే..చంద్రబాబుది కార్యాచరణ పాలన అని అభివర్ణించా రు. జగన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా నిధులు కేటాయించలేదు సరికదా కార్యాల యాల్లో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు..కూటమి అధికారంలోకి రాగానే కార్పొ రేషన్లకు నిధులు, విధులు కేటాయించామని తెలిపారు.
సీడాప్ శిక్షణతో 10 వేల మందికి ఉపాధి
ప్రతిఒక్కరిని వ్యాపారవేత్తలుగా తయారు చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం. ఇప్పటికే పౌల్టీ, షీ ఫామ్స్, మెడికల్ స్టోర్స్, ఫుడ్ ప్రాసెస్ యూనిట్‌లలో యువతకు శిక్షణ ఇచ్చి వారు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ కూడా ప్రభుత్వమే చేసే విధంగా ప్రణా ళిక రూపొందించాం. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సీడాప్ ద్వారా 10 వేల మం దికి ఉపాధి కల్పించబోతున్నాం. ఈ కార్యక్రమం జనవరి నుంచి మొదలుకానుంది. సీడాప్ చైైర్మన్ దీపక్‌రెడ్డితో ఈ విషయాలను చర్చించాం. సెంచూరియన్ యూనవర్శిటీ నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నాం. స్థానిక ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్‌పై కూడా చర్చించాం. ఇదొక మంచి ప్రభుత్వం అనడానికి మేం చేసిన మంచి పనులే నిద ర్శనం. ఎన్డీయే చెప్పిన మాట నిలబెట్టుకుంది. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశాం. ఉచిత ఇసుక ఇస్తున్నాం. అన్న క్యాంటీిన్లను ప్రారంభించాం. జగన్ భూ చట్టాన్ని రద్దు చేశాం. అభివృద్ధే ధ్యయంగా కూటమి ప్రభుత్వం ముందుకువెళుతుందని తెలిపారు.
జగన్‌రెడ్డి బీసీలకు నామినేటెడ్ పదవుల్లో కోత పెట్టారు
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు కేటాయించే 34 శాతాన్ని వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించింది. బీసీలు రాజకీయంగా ఎదగకూడదనేదే జగన్ ధ్యేయం. చంద్రబా బు, బీసీ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు పరచే విషయంపై కార్యాచరణ చేపట్టడంపై కూడా చర్చించాం. బీసీలకు 39,700 కోట్లు నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీయే కూటమి ప్రభుత్వం. గత వైసీపీ ప్రభు త్వం బీసీలకు బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేసింది. కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు కానీ కార్పొరేషన్లలో కూర్చోవడానికి కూర్చీలు కూడా లేకుండా చేశారు. టీడీపీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి నిధులు విధులు కేటాయించింది. ఈ ఆరు నెలల కాలంలోనే బీసీలకు పెద్దపీట వేశాం. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీలకు దేవుడు లాం టివాడు. ఆయన పేరుతో స్కూళ్లు, హాస్టళ్లు పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా 107 స్కూళ్లు ఉంటే 105 స్కూళ్లను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే తీసుకొచ్చాం. గత ప్రభుత్వం రం గులు మార్చుకోవడానికి, పేర్లు మార్చుకోవడానికే సరిపోయింది. బీసీ బిడ్డలు చదువుకో వడం కూడా వైసీపీ నాయకులకు ఇష్టం లేదు. టీడీపీ హయాంలో నిర్మాణాలు చేపట్టిన స్కూల్ భవనాలు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా ఉన్నాయి. ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకెళ్లి వాటిని పూర్తి చేసేందుకు నిధులు కేటాయించారు.
గత ఐదేళ్లూ బీసీ హాస్టళ్ల పరిస్థితి దారుణం
గత ఐదేళ్లూ వైసీపీ ప్రభుత్వం బీసీ హాస్టళ్ల పరిస్థితిని దారుణంగా మార్చింది. మెయింటెనెన్స్ నిధులు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. వాడుకకు నీరు లేక వాష్ రూమ్స్ సరిగా లేక, లైట్లు..ఫ్యాన్లు పనిచేయక, బిల్డింగ్ లీకేజీలతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లగా అందుకు కూడా నిధులు కేటాయించారు. బీసీ హాస్టల్ విద్యార్థులకు డైట్ బిల్ కోసం బడ్జెట్ కంటే అదనంగా రూ.45 కోట్ల నిధులు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం డైట్ చార్జీలను కూడా పెండిరగ్ పెట్టి పోయింది. దీన్ని కూడా ఇటీవల చంద్రబాబు నిధులను విడుదల చేశారు. రూ.135 కోట్లు డైట్ చార్జీలకు కేటాయించారు. ఇంకా రూ.45.55 కోట్లు ఇవ్వ డానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కాస్మోటిక్ చార్జీలు ఇవ్వకుండా ఆపేసింది. చంద్రబాబు బడ్జెట్‌లో రూ.11 కోట్లు కేటాయించగా అదనంగా రూ.21.60 కోట్లు మంజూరు చేశారు. వైసీపీ హయాంలో ట్యూటర్లకు జీతాలు ఇవ్వక పోవడంతో విద్యార్థులు, ట్యూటర్లు పడుతున్న ఇబ్బందులను కూడా సీఎం దృష్టికి తీసుకె ళ్లాం.
అందుకు కూడా ఆయన అదనంగా రూ.3.20 కోట్లు కేటాయించారు. బీసీ వేల్ఫేర్ ద్వారా 6 వేల మంది విద్యార్థులు డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌ను కూడా ప్రారంభించాం. 100 మంది సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుం టున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ను తయారు చేయాలన్నదే చంద్ర బాబు లక్ష్యం. మహిళా పక్షపాతి చంద్రబాబు. ఈడబ్ల్యూఎస్ తరపున 175 నియోజక వర్గాల్లో 80 వేల మందికి ఉచిత శిక్షణ ఇస్తూ వారికి కుట్టుమిషన్లు కూడా ఇవ్వబోతు న్నాం. మహిళల్లో ఎంపవర్‌మెంట్ తయారుకావాలి. వారి కాళ్ల మీద వారు నిలబడాల న్నదే చంద్రబాబు అభిలాష. ఈ బడ్జెట్‌లోనే ఈ పనులు మొత్తం చేయదలిచాం. పౌల్ట్రీ, పాడిపరిశ్రమ అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఎవరైనా వ్యాపారం చేయ దలచుకుంటే ఎంఎస్‌ఎంఈ ద్వారా సబ్సిడీ రుణాలు ఇస్తూ వారిని ప్రోత్సహించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వెయ్యి జనరిక్ మెడికల్ షాపులు కేటాయిస్తాం. పౌల్ట్రీ ఫామ్స్, షీ ఫామ్స్ ఏర్పాటు చేసి బీసీలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని వివరించారు.