- 15 రకాల వేధింపులకు శిక్షలు
- గౌరవప్రద జీవనమే కూటమి సంకల్పం
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
- బీసీ రక్షణపై మంత్రుల కమిటీ భేటీ
- పాల్గొన్న మంత్రులు అచ్చెన్న, కొల్లు రవీంద్ర, సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్
విజయవాడ(చైతన్యరథం): వెనుబడిన తరగతులకు చెందిన 138 కులాలకు రక్షణ కల్పించేలా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తు న్నామని, త్వరలోనే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నామని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు. బీసీలను కులం పేరుతో, వృత్తి పేరుతో దూషించి నా, సాంఘిక బహిష్కరణలకు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నేతృత్వంలో శనివారం నిర్వహించిన బీసీ రక్షణ చట్టం భేటీలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీం ద్ర, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పాల్గొన్నారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరు స్తున్నామని, ఈ నేపథ్యంలో త్వరలోనే బీసీ రక్షణ చట్టాన్ని అమ ల్లోకి తీసుకురానున్నామని తెలిపారు.
చట్టం రూప కల్పనకు తుది రూపు ఇవ్వడానికే బీసీ మంత్రులతో కీలక భేటీ నిర్వహించామని వివరించారు. ఇదివరకే రెండు పర్యాయాలు బీసీ మంత్రులు సమావేశమయ్యాం. ఇప్పటికే బీసీ చట్టం ముసాయిదా కూడా సిద్ధం చేశాం. బీసీల ధన, మాన, ప్రాణాలకు భరోసా కల్పించేలా బీసీ రక్షణ చట్టాన్ని పటిష్టంగా రూపొందిస్తున్నామని వివరించారు. 15 రకాల వేధింపులకు శిక్షలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. బీసీ మంత్రుల భేటీ వివరాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించాం. దేశంలోనే తొలిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టం అమలు చేయబోతున్నామని వివరించారు. బీసీ రక్షణ చట్టం డ్రాఫ్ట్ పై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 జోన్లలో ఉన్న బీసీ సంఘాలు, ప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించా మని
వివాదాలకు తావులేకుండా చట్టం: అచ్చెన్న, కొల్లు రవీంద్ర
అంతకుముందు నిర్వహించిన భేటీలో బీసీ చట్టం రూప కల్పనలో తీసుకున్న జాగ్రత్తలు, నిపుణులు సూచనలు గురించి బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ వివరించారు. కేంద్ర అడ్వకేట్ జనరల్, జాతీయ బీసీ కమిషన్ సలహాలు సూచనలను కూడా ఏపీ బీసీ రక్షణ చట్టం రూపకల్పనలో పరిగణలోకి తీసుకు న్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బీసీ చట్టానికి తుదిరూపు ఇచ్చే క్రమంలో రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలతోనూ చర్చించా లని కోరారు. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా బీసీ రక్షణ చట్టం రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సత్య కుమార్ యాదవ్, లా జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలిపారు. బీసీలకు గౌరవ ప్రదమైన జీవనం
అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని
తెలిపారు.















