- క్యాన్సర్ ఆస్పత్రికి భూమిపూజ
- కార్యక్రమానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబు
- క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించిన బాలకృష్ణ
అమరావతి (చైతన్య రథం): మహిళా సాధికారత ఆధారంగా తీసిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అమరావతిలో ఈనెల 13న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను బాలకృష్ణ, ఆయన సన్నిహితులు గాంధీ, సిద్ధాంతి నాగమల్లేశ్వరరావు శనివారం పరిశీలించారు. ఆస్పత్రి నిర్మాణ ప్రణాళికను సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్.. బాలకృష్ణకు వివరించారు. మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మిస్తున్నట్టు చెప్పారు. మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణం ఉంటుందన్నారు. ఇకపై తాను తీయబోయే సినిమాలలో సమాజానికి సంబంధించిన మంచి సందేశాలు ఉంటాయని బాలకృష్ణ తెలిపారు. హిందూపురంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. భారీఎత్తున పరిశ్రమలు, అంతర్రాష్ట్ర రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు బాలకృష్ణ వెల్లడిరచారు.