- నేరస్థులను ప్రోత్సహించేలా జగన్ తీరు
- న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారు
- కోర్టుకు హాజరవుతూ సిగ్గులేకుండా హడావుడా?
- టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి(చైతన్యరథం): వైసీపీ అధినేత జగన్రెడ్డిపై టీడీపీ పోలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రూ.43,000 కోట్ల భారీ ఆర్థిక అవినీతి కేసుల్లో జగన్ మోహన్ రెడ్డి ఏ1గా ఉన్నారని స్పష్టంగా పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమాదేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక అక్రమాలపై సీబీఐ విస్తృత దర్యాప్తు చేపట్టి 2012 నాటికే మొత్తం 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఈ అక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖజానాకు భారీ నష్టం కలిగించా యని అన్నారు. ఇటువంటి అవినీతిని రాష్ట్ర ప్రజలు ఎన్నడూ మరు వరని దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలు స్పష్టంగా కొనసాగుతున్నా యని పేర్కొన్నారు. జగన్ 18 నెలలు రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైలులో ఉన్నారు. బెయిల్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ జడ్జీలు, ఇంత తక్కువ సమయంలో జగన్రెడ్డి ఇన్ని కోట్లు ఎలా సంపాదించగలిగాడని ప్రశ్నించి, ఆర్థిక పరమైన కేసులు హత్య కేసుల కంటే అత్యంత ప్రమాదకరమైనవి అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆడిన ‘డ్రామా’.. నటించిన తీరు వర్ణణాతీతం.. న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు.
ఆయన గతంలో కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ తాను ముఖ్యమంత్రిని, కోర్టుకు వస్తే శాంతి భద్రతలకు ప్రమాదం కలుగుతుందని, ప్రజల జీవనం కుంటుపడు తుందని, రాష్ట్ర ఖజానాకు ఖర్చు అవుతుందని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ముద్దాయి కోర్టుకు వస్తుంటే జనం ఎందుకు రావాలి? జగన్ దేశం కోసం పోరాడిన మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదు.. ప్రజల సొమ్ము కొట్టేసిన ఆర్థిక నేరస్థుడు. గతంలో మాజీ ప్రధానులు, ముఖ్యమం త్రులు కూడా కోర్టుకు హాజర య్యారు. సీఎం అనే కారణంతో హాజరు నుంచి మినహా యింపు కోరడం సబబు కాదు అని, చట్టం దృష్టిలో దొంగ దొంగే నని స్పష్టం చేశారు.
జగన్ ఏమైనా దేశ సేవకుడా?
దండాలు పెడుతూ వస్తున్నాడు.. ఆయన ఏమైనా దేశ సేవకుడా? ఆంధ్రప్రదేశ్ కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాము లు లాంటివాడా? బ్రిటిష్ వారి తుపాకులకు రొమ్ము విరిచిన ప్రకాశం పంతులా? హైకోర్టులో చిన్న కామెంట్ చేస్తే రాజీనామా చేసి నీలం సంజీవరెడ్డి లాంటివాడా? ప్రజల సొమ్ము కొట్టేసి, 11 ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న ఆర్థిక నేరస్థుడు, ముద్దాయి కోర్టుకు హాజరయ్యే సందర్భంగా పొట్టి శ్రీరాములు వంటి దేశసేవకులు, త్యాగధనులతో పోల్చుకునే విధంగా, ప్రజలకు అభివాదం చేసే విధంగా వ్యవహరించడం సిగ్గు లేనితనం అని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి కోర్టుకు హాజరవుతున్నప్పుడు పెద్దఎత్తున హడావుడి చేసి ప్రజల నుంచి దండాలు అందుకోవడం ద్వారా తాను ఏదో గొప్ప త్యాగం చేసిన వ్యక్తిగా లేదా ప్రజా నాయకుడిగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అయితే వాస్తవానికి ఆయ న ఆర్థిక నేరాల కేసుల్లో ముద్దాయి మాత్రమే అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా జరిగిన రభస, అలజడి సీబీఐ కోర్టును ప్రభావితం చేసేదిగా ఉంద ని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పోలీసులు జగనన్ను నియంత్రించడంలో తత్తరబడ్డారని విమర్శించారు. ముద్దాయిని ఒక పోలీస్ వ్యాన్ ఎక్కించి నలుగురు పోలీసులు నేరుగా కోర్టుకు తీసుకురావచ్చు, కానీ ఆ విధంగా చేయకుండా అరాచకం సృష్టించేందుకు అనుమతించారని విమర్శించారు. ముద్దాయి రాకకు ప్రాధాన్యత ఇచ్చి సీబీఐ కోర్టు పరిసర ప్రాంతాల్లో దుకాణా లను మూయించడం, కక్షిదారులు, న్యాయవాదులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.
న్యాయమూర్తులకు విజ్ఞప్తి
వైసీపీ సోషల్ మీడియాలో ‘లయన్ ఈజ్ బ్యాక్ టు హైదరాబాద్’, ‘రేపు హైదరాబాద్ లో ఉండేది జగనన్న రూల్’ వంటి పోస్టులు పెట్టడం, ‘2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే’ అని ప్లకార్డులు ప్రదర్శించడం ద్వారా వీరు తెలంగాణ ప్రభుత్వాన్ని, న్యాయస్థానా లను బెదిరించాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 13 ఏళ్లుగా కండిషన్ బెయిల్లో ఉన్న ముద్దాయి బరితెగించి వ్యవహరించడాన్ని న్యాయ స్థానాలు తీవ్రంగా పరిగణించి బెయిల్ రద్దు చేసి విచారణ పూర్తయ్యే వరకు రిమాండ్కు పంపి జైలులోనే ఉంచాలని డిమాండ్ చేశారు. సీబీఐ కోర్టు న్యాయమూర్తికి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిసికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేతులెత్తి నమస్క రిస్తూ ఈ వ్యవహారాన్ని ప్రత్యేకంగా తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ మోహన్రెడ్డి దొంగ కారణాలతో కోర్టుకు హాజరుకాకుండా ఉన్న వ్యక్తి అని ఇప్పుడు ఇంత రభస చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదని, వెంటనే అతని బెయిల్ను రద్దు చేసి రిమాండ్కు పంపి విచారణ పూర్తి అయ్యే వరకు జైలులోనే ఉంచాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థకు, సీబీఐ కోర్టుకు ఇది పరీక్షా కాలం అని ఈ కేసులో 11 చార్జిషీట్లు ఉన్నా విచారణ ముందుకు పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఈరోజు వ్యవహరించిన తీరు ద్వారా తాను అరాచక శక్తిని, రౌడీని, చట్టా లను గౌరవించనివాడిని, రాజ్యాంగం అంటే నమ్మకం లేనివాడిని అని స్వయంగా నిరూపించుకున్నారు. నిందితుడు కోర్టుకు కేవలం ఒక గంట మాత్రమే హాజరవుతానని షెడ్యూల్లో పెట్టడం ద్వారా జగన్ న్యాయస్థానాన్ని ఆదేశిస్తున్నాడా, న్యాయస్థానాన్ని గౌరవించ డం లేదా అని ప్రశ్నించారు. జగన్ వ్యవహరించిన తీరు తాగు బోతు, నిప్పు తొక్కిన కోతిలాగా ఉందని, బాధ్యత గల పౌరుడిలా వ్యవహరించలేదని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.












