- పలు ఉద్యమాలకు నేతృత్వం వహించిన గొప్ప నాయకుడు
- పేదల కోసం పోరాడిన గొప్ప నేత
- మంత్రి లోకేష్ ఘన నివాళులు
అమరావతి (చైతన్యరథం): స్వాతంత్య్ర సమరయోధులు, బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ నివాళులు కొనియాడారు. గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా శనివారం ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి లోకేష్ ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయాలకు అతీతంగా పేదల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి లచ్చన్న అని అంతకు ముందు ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, బలహీన వర్గాలు, రైతు, కార్మిక నాయకుడిగా అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించిన గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరం కృషిచేద్దామని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.