- తీర్చిదిద్దేందుకు కార్యాచరణ తయారుచేయాలి
- సాస్కీ నిధులతో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం
- ఆదరణ -3 ద్వారా ఆధునిక పరికరాల పంపిణీకి చర్యలు
- బీసీ సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): వెనుకబడిన వర్గాలను మైక్రో ఎంటర్ప్రెన్యూర్లుగా, ఎంఎన్ఎంఈలుగా తీర్చిదిద్దేందుకు కార్యా చరణ తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆదరణ 3 పథకం ద్వారా కులవృత్తుల వారీగా ఆధునిక పరికరాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం బీసీ సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణంతో పాటు అక్కడ సురక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రూ.60 కోట్ల సాస్కి నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించా రు. 814 బీసీ సంక్షేమ హాస్టళ్లలో రూ.17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో పాటు హాస్టళ్లలో శానిటేషన్ తోపాటు విద్యార్థు లకు అందించే ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు.
విద్యార్థుల ఆరోగ్యం, విద్యా బోధన సహా అన్ని అంశాల్లోనూ బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించాలని సూచనలు ఇచ్చారు. బీసీ విద్యార్థులకు విద్యాపరమైన అంశాల పర్యవేక్షణకు అపార్ ఐడీలను నమోదు చేసి అను సంధానం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న బీసీ భవనాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 6 మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షి యల్ స్కూళ్లను జూని యర్ కాలేజీలుగా మార్చాలని సీఎం ఆదేశిం చారు. బీసీ హాస్టళ్లు, రెసిడెన్షి యల్ పాఠశాలల్లో నెట్ జీరో కాన్సెప్టు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాల న్నారు. ప్రతీ నియోజక వర్గంలోనూ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ఆలోచన చేస్తు న్నామని తెలిపారు.. రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిళ్లను తదుపరి స్థాయి కి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. వెనుక బడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని వారికి ప్రయో జనం కలిగేలా పథకాలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.















