- రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ప్రజా తీర్పు
- యాంటీ ఇన్‌కంబెన్సీతోపాటు బాబుపై పాజిటివ్ ఓటింగ్ పెల్లుబికింది
- అన్ని వర్గాలు.. అన్ని ప్రాంతాలు కూటమికి అఖండ విజయం చేకూర్చాయి
- ప్రతిపక్ష హోదా కోల్పోయింది జగన్ ఒక్కడే
2014-19 మధ్య చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలు, ప్రాంతాలు లబ్దిపొందాయి. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం సమపాళ్లలో సాధ్యమైంది. ప్రజాస్వామ్యయుత పాలన నడిచింది. 2019`24 మధ్య జగన్ పాలన చంద్రబాబు పాలనకు పూర్తి విరుద్ధమైంది. ప్రజలు.. విధ్వంసక పాలనను అనుభవ పూర్వకంగా అర్థం చేసుకున్నారు. జగన్‌ను గెలిపించి మోసపోయామని బాధపడుతున్న సమయంలో `అక్రమ కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించాడు జగన్. భువనమ్మను శాసనసభలో అవమానపర్చడాన్ని ప్రజలు భరించలేకపోయారు. యువత భవిత కాంక్షిస్తూ లోకేష్ తలపెట్టిన ప్రజాగళాన్ని అడ్డుకోవడంపైనా ప్రజలు తిరగబడ్డారు. పవన్‌కళ్యాణ్‌పై వ్యక్తిత్వహననానికి పాల్పడటాన్నీ జీర్ణించుకోలేకపోయారు. ఇవన్నీ వైసీపీపట్ల ప్రజల్లో రగిలిన కోపాగ్నికి కారణమైంది. అదే సమయంలో పవన్‌కళ్యాణ్, నరేంద్రమోదీ, చంద్రబాబు.. జతకట్టిన కూటమి అగ్నికి ఆజ్యంపోసింది. ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. అంతిమ నిర్ణేతలు ప్రజలేగాని `నిర్భంధాలు, దోపిడీ దుడ్డు, మద్యం పీపాలుకాదని ఎన్నికలు రుజువు చేశాయి.
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రజా తీర్పు. జగన్‌ను విపక్షంగా చూడ్డానికీ జనం ఇష్టపడలేదనడానికి అద్దంపట్టే తీర్పు. ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనలో శిథిలమైన రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే గట్టెక్కించగలదని భావించి ప్రజలిచ్చిన తీర్పు. మోసపోయిన పేదలిచ్చిన తీర్పు. భవిత కోసం యువతిచ్చిన తీర్పు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలిచ్చిన తీర్పు. తమ ఆస్తులు, ప్రాణాలు, మానాలు కాపాడుకోవడానికి సకల జనులిచ్చిన తీర్పు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మేధావులు, ప్రజలిచ్చిన తీర్పు. నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ నాయకత్వాలకు ప్రజలు పట్టంగట్టిన తీర్పు. దోపిడీ దుడ్డుపై, మద్యం పీపాలపై, కసాయి మూకలపై ప్రజా విజయం -ఈ చారిత్రక తీర్పు.
వర్తమాన గెలుపునుంచి అందే అధికారం చంద్రబాబుకు పూలబాట కాదు. రూ.13 వేల కోట్లు అప్పుతో ఏడాదికి రూ.50 వేల కోట్ల వడ్డీ, అసలు వాయిదాల చెల్లింపు భారం మోయాల్సి వుంది. వివిధ వర్గాలకు జగన్ పెట్టిన బకాయిలు రూ.2 లక్షల కోట్లు చెల్లించాల్సివుంది. మేనిఫెస్టో హామీలు అమలు చేయాల్సివుంది. పోలవరం పూర్తి చేసి.. నదులు అనుసంధానించాల్సివుంది. అమరావతి నిర్మాణంతో సంపద సృష్టించాల్సివుంది. నీలి మీడియా, జగన్ మాఫియా దుష్ప్రచారాలు, దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విజయంతో కూటమి శ్రేణులు నమ్రత పెంచుకుని ప్రజాభిమానాన్ని పెంచుకోవాలి. దౌర్జన్యాలకు దూరంగా ఉంటూనే.. వైకాపా కసాయి మూకలు దాడులను మాత్రం తిప్పికొట్టాలి. 2004లో చంద్రబాబు గెలిచివుంటే నేడు ప్రతి జిల్లా కేంద్రం మరో సైబరాబాద్ అయ్యుండేది. 2019లో గెలిచివుంటే.. నేటికి 175 నియోజకవర్గ కేంద్రాలు ఉద్యోగ, ఉపాధి కల్పనా కేంద్రాలుగా విరాజిల్లేవి. గతాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. భవిష్యత్‌ను గుర్తు పెట్టుకోడానికి. అంటే, 2029లోనూ కూటమి అధికారం చేపట్టగలిగితేనే.. జగనాసుర విధ్వంసంవల్ల రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని అధిగమించే అవకాశముంటుంది. చంద్రన్న బాటే సరైందని, చంద్రన్న నాయకత్వమే విశ్వసనీయమైందని ప్రజలు రుజువు చేశారు. జగన్‌రెడ్డి దోపిడీ పాలన, దౌర్జన్యకాండ స్వల్పకాలమేగాని దీర్ఘకాలం కాదని చరిత్ర రుజువు చేయబోతున్నది.
క్లాసు, మాసూ ఒక్కటై బందిపోట్ల ముఠాను చిత్తుచిత్తుగా ఓడిరచాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపాడు జగన్. విషపూరిత మద్యంపోసి 35 లక్షలమంది పేదల ఆరోగ్యాలను పాడు చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదల అసైన్‌మెంట్ భూములు 10 లక్షల ఎకరాలు కొల్లగొటాడు. లక్ష కోట్ల సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించాడు. అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, నిరుద్యోగభృతి, పండుగ కానుకలాంటి వంద టీడీపీ సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. గంజా, డ్రగ్స్ మాఫియాతో లక్షలాది యువతను నిర్వీర్యం చేశాడు. ఇసుక మాఫియాతో 125 వృత్తులు, వ్యాపారాల్ని దెబ్బతీసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టాడు. డ్వాక్రా, అంగన్‌వాడి, ఆశా వర్కర్‌లను నయవంచన చేశాడు. ఉద్యోగులు, పింఛన్‌దారులు దాచుకున్న సొమ్ము కాజేశాడు. రూ.13 వేల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని దివాళా తీయించాడు. 30 వేలమంది యువతుల అక్రమ రవాణాకు కారకుడయ్యాడు. పంచాయతీలు, మున్సిపాలిటీల నిధులు రూ.12 వేల కోట్లు దారిమళ్లించి స్థానిక పాలనను నిర్వీర్యం చేశాడు. పోలవరాన్ని గండికొట్టి నదుల అనుసంధానాన్ని నాశనం చేసి కరువు కోరలకు ప్రజల్ని బలిపెట్టాడు. విశాఖ భూకబ్జాల కోసం అమరావతిపై నిందలు మోపి ఉద్యోగాలు, సంపద సృష్టించే రాజధాని లేకుండా చేశాడు.
ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజా, డ్రగ్స్, ఎర్రచందనం మాఫియాగా మారి రూ.10 లక్షల కోట్లు విలువగల ప్రకృతి వనరుల్ని, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారు. ప్రయివేట్ ఆస్తుల్ని, భూముల్ని కబ్జా చేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. ప్రశ్నించిన పౌరుల్ని, మీడియాను, మేధావుల్ని, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో తోయించాడు. చిన్నాన్న హంతకుల్ని కూడా కాపాడే దుర్మార్గ స్థితికి దిగజారాడు. వ్యవస్థల్ని విధ్వంసం చేశాడు. జగన్‌రెడ్డి నేరాలు, ఘోరాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి కుల, మత, ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టాడు. దేవాలయాలపై దాడులు తారాస్థాయికి పెంచాడు. చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు సైతం కబ్జా చేశారు.
పదిచ్చి వంద గుంజుకొన్న వైనాన్ని పేదలు అర్థం చేసుకున్నారు. స్వార్థ రాజకీయానికి 30మంది పింఛన్‌దారుల ప్రాణాలు ఫణంపెట్టి శవ రాజకీయానికి పాల్పడ్డాడు. సానుభూతి కోసం గులకరాయి దాడి కథ నడిపి బీసీ మైనరు బిడ్డను 45 రోజులు జైలు పాల్జేశాడు. కోడికత్తి డ్రామాతో దళిత యువకుణ్ణి 5 ఏళ్లపాటు జైల్లో మగ్గబెట్టాడు. పేదల్ని ఇలా కాల్చుకుతిని పేదల మనిషిగా కపట ప్రేమ ఒలకబోశాడు. పేదల ద్రోహి జగన్ అని, పేదల పెన్నిధి చంద్రన్ననని పేదలు గుర్తించి వైకాపాకు తగిన శాస్తి చేశారు. జగన్ నమ్మకద్రోహాన్ని గుర్తించి ఎన్నికల్లో తగిన శాస్తి చేశారు.
గుంతలమయమైన రోడ్లకు తట్టెడు మట్టి వేయలేదు. విద్యుత్ వ్యవస్థను నీరుగార్చి విద్యుత్ ఛార్జీల బాదుడు బాదారు. కరెంటు కోతలు పెట్టి పరిశ్రమలు, వ్యాపారాల్ని దెబ్బకొట్టాడు. కమిషన్ల కోసం కక్షలతో పరిశ్రమలపై దాడులుచేసి పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. మెగా డీయస్సీ, జాబ్ క్యాలెండర్‌పై మాటతప్పి మడమ తిప్పాడు. ఎయిడెడ్ కళాశాలలను నాశనం చేశారు. నిరుద్యోగం 24శాతానికి పెంచాడు. తన దోపిడీ కోసం అన్ని వర్గాల్ని, అన్ని ప్రాంతాల్ని మినహాయింపు లేకుండా దోచుకున్నాడు. రాజ్యాంగబద్ధపాలన కాకుండా నియంతలా టెర్రరిజం నడిపాడు. అందుకే రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకత్వ హోదా కోల్పోయింది జగన్ ఒక్కడే!
గురజాల మాల్యాద్రి
జాతీయ అధికార ప్రతినిధి