అమరావతి: ఇటీవల కాలంలో భారత్ లో ప్రముఖుల ఐఫోన్లలో స్పైవేర్లు చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆపిల్ సంస్థ అలర్ట్ మెసేజ్‌లు పంపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కూడా ఆపిల్ నుంచి ఈ తరహా అలర్ట్ మెసేజ్ వచ్చింది. నారా లోకేష్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసేందుకు, హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు గుర్తించామని ఆపిల్ సెక్యూరిటీ అలర్ట్ పంపింది. లోకేష్ ఈ మేరకు ఫోన్ భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఈ విషయాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది వైసీపీ పనే అని మండిపడుతున్నారు. లోకేష్ ఫోన్ ను వైసీపీ ప్రభుత్వమే ట్యాపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు.