బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలానికి చెందిన రైతులు సోమేశ్వరపురంలో యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బద్వేలు బ్రహ్మంసాగర్ నుంచి అట్లూరు మండలం గుండా వచ్చే కుడి కాలువపై మా మండలంలోని 20 గ్రామాలరైతులు ఆశలుపెట్టుకున్నాం. ఈ కాలువ పనులను గతప్రభుత్వ హయాంలో మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు కొనసాగించకుండా నిలిపేసింది. దీనిని పూర్తిచేస్తే 20గ్రామాలపరిధిలో 20వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయి. మీరు అధికారంలోకి వచ్చాక కాలువ పనులను పూర్తిచేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ… రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ వాస్తవానికి ఈ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు రూ.11,700 కోట్లు ఖర్చుచేయగా, జగన్ అధికారంలోకి వచ్చాక ఖర్చుచేసింది కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే. టిడిపి అధికారంలోకి వచ్చాక మిషన్ రాయలసీమలో భాగంగా బ్రహ్మంసాగర్ కాల్వల పనులు పూర్తిచేసి అట్లూరు మండలంలోని రైతులకు సాగునీరు అందజేస్తాం.