కోడి కత్తి డ్రామా బట్టబయలవడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ మళ్ళీ విధ్వంసానికి పూనుకున్నారని, చదువుల తల్లి గీతం యూనివర్సిటీ పై జగన్ కి అంత కక్ష్య ఎందుకని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా జగన్ విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. గీతం యూనివర్సిటీ గోడలు కూల్చడం దుర్మార్గపు చర్య. కోడి కత్తి డ్రామాని న్యాయస్థానాలు బట్టబయలు చేయడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ విధ్వంసానికి పూనుకున్నారన్నారు. చదువుల తల్లి గీతం యూనివర్సిటీ పై జగన్‌కు అంత కక్ష్య ఎందుకు ? టీడీపీ నేతల ఆస్తులు కూల్చడం, అక్రమ కేసులు పెట్టడం జగన్‌కు వ్యసనంగా మారిపోయిందన్నారు. నియంతలు, నికృష్టులు పాలకులైతే పరిపాలన ఇలానే ఉంటుందన్నారు.
జగన్ ప్రభుత్వంలో నిర్భంధం, అణచివేతలు, వేధింపులు, రౌడీయిజం తారాస్థాయికి చేరిందన్నారు. అక్రమ నిర్మాణాలు అని అర్ధరాత్రి కూల్చివేస్తున్నారే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాకది-నీకిది పద్దతిలో నిర్మించిన హైదారాబాద్, బెంగుళూరు, ఇడుపుల పాయలలో నిర్మించిన రాజప్రసాదాలకు ఏం సమాధానం చెబుతారన్నారు. ప్రతిపక్షనేతల ఆస్తులు కూల్చుతున్న జగన్ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చడం ఖాయం. టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్‌కి, వైసీపీ నేతలకు పరివర్తన పాఠాలు నేర్పిస్తామన్నారు.