సీఐడీ సీఎం చేతిలో పకోడీలా మారిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మార్గదర్శి వ్యహహారంపై మాట్లాడిన న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఇది యావత్ న్యాయ వ్యవస్థ పై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. ఇన్నాళ్లు ప్రతిపక్ష నేతల గొంతు నొక్కిన జగన్ ఇప్పుడు న్యాయవాదుల నోరు నొక్కుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో వైసీపీ నేతలు తప్ప ఇంకెవరూ మాట్లాడకూడదన్నట్టు జగన్ వైఖరి ఉందన్నారు. సీఐడీ నోటీసులు భావస్వేచ్ఛ ప్రకటనకు వ్యతిరేకమన్నారు. న్యాయవాదులకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 126 కింద వృత్తి వ్యవహారం గురించి ఎవరికీ ప్రశ్నించే హక్కు లేదన్నారు. సీఐడీ అధికారులు ఓవరాక్షన్ మానుకోవాలి లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.