- జీఎస్టీ టీడీపీ సంస్కరణలను స్వాగతిస్తోంది
- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రలా శీనివాసరావు
అమరావతి (చైతన్యరథం): జీఎస్టీ భారాన్ని తగ్గించడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల భవిష్యత్తుకు మరింత భరోసా కల్పిం చే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా స్వాగతిస్తోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నిత్యావసర వస్తువులు, వైద్యం, విద్య, వ్యవసాయ పరికరా లపై జీఎస్టీ రేట్లను తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలు, రైతుల కొనుగోలు శక్తి గణనీయంగా పెరుగుతుందన్నారు. 33 రకాల అత్యవసర ఔషధాలపై జీఎస్టీ రద్దు, ఇతర మందులపై పన్ను 5%కి తగ్గించడం వల్ల ఆరోగ్య ఖర్చులు తగ్గి, దీర్ఘకాలిక వ్యాధు లతో బాధపడుతున్న రోగులకు, సామాన్య కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభిస్తుం దన్నారు. ప్రాణాధార ఔషధాలపై పన్ను లేకపోవడం నిజంగా హర్షణీయం.
విద్యా సంబంధిత వస్తువులపై జీఎస్టీ తగ్గింపు విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక ఊరట నిచ్చి, విద్యను మరింత అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయ పరికరాలపై పన్ను తగ్గింపు రైతులకు ప్రత్యక్షమద్దతుగా నిలిచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపడేలా చేస్తుం ది. వ్యక్తిగత వస్తువులపై పన్ను తగ్గింపు వినియోగాన్ని పెంచి, చిన్న-మధ్య తరగతి వ్యాపారాలకు తోడ్పడుతుంది. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దుతో కోట్ల కుటుంబాలకు బీమా రక్షణ చేరువ చేయ నుంది. ఈ జీఎస్టీ సంస్కరణలు ప్రజల ఖర్చులను తగ్గించడం మాత్రమే కాకుండా, వినియోగాన్ని పెంచి దేశీయ మార్కెట్కి ఊతమిస్తాయి, పెట్టుబడుల వృద్ధికి దోహదపడతాయి, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత విస్తరిస్తుంది.
టీడీపీ స్థాపన నుంచి పేద, మధ్యతరగతి, రైతులు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశ ప్రజలకు నిజమైన దీపావళి కానుకగా నిలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్కు టీడీపీ తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఒక ప్రకటనలో పల్లా పేర్కొన్నారు.