- బాధితుల ఇళ్ల వద్దే రూ.20 లక్షల చెక్కులు
- స్వయంగా అందజేసిన మంత్రుల బృందం
- ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
- జీజీహెచ్‌లో క్షతగాత్రులకు పరామర్శ
కాకినాడ(చైతన్యరథం): వేట్లపాలెం బాణాసంచా పేలుడు దుర్ఘ టనలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.20 లక్షల చొప్పున బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి పి.నారాయణ, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, అమలాపురం ఎంపీ జి.హరీష్ మాధుర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ మాధవ్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేట్లపాలెం గ్రామానికి చెందిన మృతు లు నూకల దేవి, తుంపాల లోవరాజు, సాధనాల సత్యవేణి, గొడత నాని, వల్లూరి రవి, సుకుమల్ల రాఘవ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చెక్కులు అందజేశారు. ముందుగా బాణాసంచా పేలుడు సంఘటన స్థలాన్ని సందర్శించి దుర్ఘటనకు దారితీసిన కారణాలను పరిశీలించారు. పేలుడు దుర్ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టడంతో పాటు ఇటువంటి సంఘ టనలు పునరావృతం కాకుండా మరింత నిశితమైన భద్రత, పర్య వేక్షణ వ్యవస్థలను అమలు చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంత్రి సుభాష్ కాకినాడ జీజీహెచ్‌కి వెళ్లి గాయ పడిన వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ జి.బింధుమాధవ్ పాల్గొన్నారు.
కందుల దుర్గేష్ పరామర్శ..చెక్కుల పంపిణీ
మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం కాకినాడ జిల్లా సామర్ల కోట మండలంలో పర్యటించారు. వేట్లపాలెం గ్రామంలోని బాణా సంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పో యిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ప్రకటిం చిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీని వాస్, కాకినాడ జనసేన పార్టీ ఇన్చార్జి, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులతో కలిసి అందజేశారు. మరణించిన సామర్ల కోటకు చెందిన దర్శిపాటి నాని(38), ఏడిద సంపత్ కుమార్ (25), జి.మేడపాడు గ్రామానికి చెందిన గంపల మంగ(43), గంపల నాగరాజు(45), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని(44), గొడత మహేష్(41), గొడత వీరవెంకట రమణ(48), కడింపల్లి ధనరాజు(55), పెదబ్రహ్మదేవంకి చెందిన మకర రాఘవమ్మ (55) కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. మంత్రి దుర్గేష్ పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్న భరోసా కల్పించారు.
అంత్యక్రియలకు ప్రభుత్వం సహకారం
వేట్లపాలెం ప్రాంతంలో జరిగిన దురదృష్టకర ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు మహా ప్రస్థా నం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో సంబం ధిత అధికారులు సమన్వయం చేసుకుని మృతదేహాలను గౌరవ ప్రదంగా స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. అంత్యక్రి యలు నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అం& ƒగా నిలవడం మానవత్వానికి నిదర్శనం.













