- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైసీపీ ఆందోళనలు విడ్డూరం
- రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిన జగన్
- ఆ బకాయిలు మేము తీరుస్తున్నాం
- మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): డీఎస్పీ నోటిఫికేషన్‌పై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మార్చిలో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభిం జూన్‌లోగా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతంపైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వాలేనని గుర్తుచేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటున్నాం, ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అన్ని నిర్ణయాల్లోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందన్నారు. విద్యా శాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు వింటున్నారని తెలిపారు. టీచర్ల బదిలీలు పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని నిరూపిస్తున్నామని.. అందులో భాగస్వామ్యులైన వారందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటూ ప్రజాస్వామ్య విలువలు చాటుతున్నామని మంత్రి వెల్లడిరచారు.
వైసీపీ ఆందోళనలు విడ్డూరం
జగన్ రెడ్డి రూ. 3 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి దిగిపోయారని మంత్రి లోకేష్ విమర్శించారు. మేము వచ్చాక రూ.800 కోట్లు చెల్లించాం. జగన్ పెట్టిన జగన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వైసీపీ నేతలు ఆందోళనలు చేయటం విడ్డూరంగా ఉందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. జగన్ రైతులకు పెట్టిన ధాన్యం బకాయిలు, పెండిరగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలు అన్నీ తామే తీరుస్తున్నామన్నారు. అలాగే జగన్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తీర్చేది కూడా తామే అని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసిందని వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల సంఖ్య కచ్చితత్వాన్ని తెలుసుకునేందుకు ఆపార్ కార్డ్ విధానం తెస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ నివారణకు ప్రత్యేక వ్యవస్థ తీసుకొస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు.