చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

టీసీఎస్‌ను ఆయనే తీసుకొచ్చినట్లు..జగన్‌కు ఆత్మ చెప్పిందేమో!

కొలనుకొండలో సింహా కియా షోరూమ్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్‌

by చైతన్యరధం
Oct 12, 2024 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
టీసీఎస్‌ను ఆయనే తీసుకొచ్చినట్లు..జగన్‌కు ఆత్మ చెప్పిందేమో!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌రెడ్డి తరిమేసిన పరిశ్రమలను మళ్లీ తీసుకువస్తాం
  • అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం
  • ఫేక్‌ ప్రచారంపై కఠిన చర్యలు
  • జగన్‌ ప్రజల్లోకి వెళ్తానంటే మేం అడ్డుకోం
  • కొలనుకొండలో సింహా కియా షోరూమ్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్‌

మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రానికి టీసీఎస్‌ సంస్థను తానే తీసుకువచ్చానంటున్న జగన్‌ రెడ్డికి.. బహుశా ఆయన ఆత్మ ఆ విషయం చెప్పిందేమో అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్‌ను శుక్రవారం మంత్రి లోకేష్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో కూడా చంద్రబాబునాయుడు కియా మోటార్స్‌ను ఏపీకి తీసుకువస్తే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి లేఖ రాయటం వల్లనే ఆ కంపెనీ వచ్చిందన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎంతో శ్రమించి టీసీఎస్‌ సంస్థను విశాఖ తీసుకువస్తుంటే.., తానే తీసుకువచ్చినట్లు జగన్‌ చెప్పుకుంటున్నారు. ఆత్మలతో మాట్లాడే అలవాటున్న జగన్‌కు.. ఆయనే టీసీఎస్‌ను తీసుకువచ్చాడని బహుశా ఆయన ఆత్మ చెప్పినట్లుందని మంత్రి లోకేష్‌ ఎద్దేవా చేశారు. జగన్‌ రెడ్డి పాలనలో ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించారో బహిర్గతం చేయాలి. టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య 44వేల పరిశ్రమల ఏర్పాటుతో పాటు 8 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు స్వయంగా వైసీపీ ప్రభుత్వమే శాసనమండలిలో ఒప్పుకుంది. నేడు చంద్రబాబు వచ్చిన తర్వాతనే ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే టీసీఎస్‌, లులు వచ్చాయి. ఇంకా అనేక పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతంలో జగన్‌ రెడ్డి తరిమివేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తామని మంత్రి లోకేష్‌ ఉద్ఘాటించారు.
అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం
రాయలసీమకు.. మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు, ఉత్తరాంధ్రకు.. సేవారంగ సంస్థలు తీసుకువస్తాం. కర్నూలుకు.. విండ్‌, సోలార్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు, సిమెంట్‌ ఫ్యాక్టరీలు, కడప, చిత్తూరుకు.. ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు, అనంతపురానికి.. ఆటోమొబైల్స్‌ పరిశ్రమలు, ఉభయగోదావరికి.. ఆక్వా, పెట్రో కెమికల్‌ పరిశ్రమలు తీసుకువస్తాం. కృష్ణా, గుంటూరులో అనేక పెట్టుబడులు తీసుకువస్తాం. పరిపాలన కేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.
బుక్‌ల విషయంలో నన్ను చూసి ఇన్‌స్పైర్‌ అయినట్లుంది
బ్లూ బుక్‌, గుడ్‌ బుక్‌ అంటున్న వైసీపీ .. నన్ను చూసి ఇన్‌స్పైర్‌ అయినట్లు ఉంది. పాదయాత్రలో వంద బహిరంగ సభల్లో మాట్లాడాను. రెడ్‌బుక్‌ చూపించి.. చట్టాన్ని ఉల్లంఘించి, ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులు, వైసీపీ నాయకులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని చెప్పాం. ఇప్పటికే యాక్షన్‌ మొదలైంది. వైసీపీ వేరే పుస్తకాలు పెడితే పెట్టుకోనివ్వండి.. మాకేం భయం లేదని మంత్రి లోకేష్‌ అన్నారు.
ఫేక్‌ న్యూస్‌ ప్రచారంపై కఠిన చర్యలు
వరదసాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. దాదాపు 10 రోజులకు పైగా చంద్రబాబునాయుడు, మంత్రివర్గం మొత్తం విజయవాడలో ముంపు ప్రాంతాల్లోనే తిరుగుతూ సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఆనాడు వైకాపా ఎక్కడుంది? వరద బాధితులను ఆదుకునేందుకు కోటి రూపాయల సాయం ప్రకటించిన జగన్‌ రెడ్డి.. ఎక్కడ ఖర్చుపెట్టారో చెప్పాలి. మేం వాస్తవాలన్నీ ప్రజల ముందు పెట్టాం. రీహాబిలిటేషన్‌ యుద్ధప్రాతిపదికన చేపట్టాం. సుమారు రూ.650 కోట్లు ఖర్చుపెట్టాం. ఏవైనా లోటుపాట్లు ఉంటే, సాయం అందకపోతే వివరాలు ఇవ్వాలి. దీనిపై చర్యలు తీసుకుంటాం. తప్పులు సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వైసీపీ మాదిరిగా మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదు. వరదలు వస్తే జగన్‌ కనీసం తాడేపల్లి ప్యాలెస్‌ గేటు కూడా దాటలేదు. వాస్తవాలు ఇప్పుడైనా తెలుసుకోవాలి. ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు వాస్తవాలు తెలుసు. మేం న్యాయబద్ధంగా వెళ్తామని మంత్రి లోకేష్‌ చెప్పారు.
జగన్‌ ప్రజల్లోకి వెళ్తానంటే మేం అడ్డుకోం
జగన్‌ ప్రజల్లోకి వెళ్తానంటే వెళ్లనివ్వండి. ఆయన మాదిరిగా మేం గేట్లకు తాళ్లు కట్టబోం. గతంలో చంద్రబాబు ధర్నా చేయాలంటే అనుమతులు కూడా ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ప్రజల్లోకి వెళ్లవచ్చు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
గుంటూరులో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం త్వరలోనే చేపడతాం. అన్నీ పద్ధతి ప్రకారం చేస్తాం. మంగళగిరిలో ఎయిమ్స్‌కు నీటి సరఫరాతో పాటు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరలోనే చేపడతాం. మూడు నెలల్లో మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ పనులు చేపడతాం. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తాం. పార్టీలో కష్టపడిన వారికి నామినేటెడ్‌ పదవులు ఇస్తాం. సనాతన ధర్మ బోర్డు విషయంలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రోడ్ల నిర్మాణం కూడా త్వరలోనే చేపడతాం. ఐదేళ్లలో రోడ్లను వైసీపీ పట్టించుకోలేదని మంత్రి లోకేష్‌ విమర్శించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-02-2026

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

అరాచక ప్రవర్తనే వారి నైజం

Previous Post

ఐదేళ్లలో శాశ్వత గృహ వసతికి ప్రణాళిక

Next Post

ప్రజాదర్బార్‌ వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-02-2026

కార్యకర్త
@ February 12, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

చైతన్యరధం
@ February 11, 2026
అరాచక ప్రవర్తనే వారి నైజం
ఆంధ్రప్రదేశ్

అరాచక ప్రవర్తనే వారి నైజం

చైతన్యరధం
@ February 11, 2026
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

చైతన్యరధం
@ February 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-02-2026

కార్యకర్త
@ February 11, 2026
మానసిక ఉల్లాసానికే..
ఆంధ్రప్రదేశ్

మానసిక ఉల్లాసానికే..

చైతన్యరధం
@ February 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-02-2026

కార్యకర్త
@ February 10, 2026
బీటెక్‌ రవికి భద్రత పునరుద్ధరించండి
ఆంధ్రప్రదేశ్

ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఆందోళన వద్దు

చైతన్యరధం
@ February 10, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

చైతన్యరధం
@ February 11, 2026
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

చైతన్యరధం
@ February 11, 2026
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

చైతన్యరధం
@ February 10, 2026

హిందూ సమాజానికి జగన్ రెడ్డి ద్రోహం

చైతన్యరధం
@ February 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

చైతన్యరధం
@ February 11, 2026
అరాచక ప్రవర్తనే వారి నైజం

అరాచక ప్రవర్తనే వారి నైజం

చైతన్యరధం
@ February 11, 2026
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

చైతన్యరధం
@ February 11, 2026
మానసిక ఉల్లాసానికే..

మానసిక ఉల్లాసానికే..

చైతన్యరధం
@ February 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist