- ఆర్యవైశ్యుల అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యం
- బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యమని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశా రు. బుధవారం సచివాలయంలో మంత్రి సవితను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేశ్ సహా పలువురు డైరెక్టర్లు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. 2018-19లో ఆర్యవైశ్యుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు రూ.30 కోట్ల మేర నిధులు కేటాయించారన్నారు. 2024-25, 2025-26 బడ్జెట్‌లో ఆర్యవైశ్యులకు భారీగా నిధులు కేటాయించినట్లు వివరించారు. ఆర్యవైశ్యుల్లోని పేదలకు ఆర్థిక భరోసా కల్పించడానికి సహకార క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేయాలని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం ఆదేశాల మేరకు త్వరలో ఏపీ ఆర్యవైశ్య కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దాని ద్వారా ఆర్యవైశ్యులకు రుణ సదుపాయం కల్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఎస్ ఎంఈలో భాగంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేయబోతున్నామన్నారు. ఆర్యవైశ్యుల కార్పొరేషన్ సభ్యులు తెలిపిన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. అంతకుముందు ఆర్యవైశ్య కార్పొరేషన్ పాలక మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి మంత్రి సవితకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేశ్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.