- స్యార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలి
- అవి వస్తేనే అమరావతి అభివృద్ధి పరుగులు
- అదనపు భూ సమీకరణపై నిర్ణయం తీసుకోలేదు
- పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లు 90 శాతం పూర్తయ్యాయని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను గురువారం మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పునః ప్రారంభం అవుతాయన్నారు. సభా వేదిక వద్దకు వచ్చేందుకు అవసరమైన రోడ్లను గుర్తించాం. 11 పార్కింగ్ ప్రాంతాలు,8 రోడ్లను గుర్తించాం. రాజధానికిగా అమరావతిని ప్రకటించిన తరువాత కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాలు భూమిని రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రధాని సభ వద్ద రైతులను గౌరవించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. మొత్తం మూడు స్టేజ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అదనపు భూ సమీకరణ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం. ప్రజలు భూ సమీకరణకు అంగీకరిస్తే చేస్తాం లేని పక్షంలో భూసేకరణ గురించి ఆలోచిస్తాం. స్మార్ట్ ఇండస్ట్రీన్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది.
అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే అమరావతికి స్మార్ట్ ఇండస్ట్రీన్ వస్తాయి. హైదరాబాద్‌లో ఒక ఎయిర్ పోర్ట్ ఉన్నప్పటికీ.. శంషాబాద్ విమానాశ్రయం నిర్మించారు. దానివల్లే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారీగా తరలివచ్చాయి. రెండవ విమానాశ్రయం లేకుండా వుంటే హైదరాబాద్‌లో ఇప్పుడు 10శాతం విమానాలు కూడా దిగేవి కావు. రానున్న 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపడతున్నారు. అమరావతిలో పెరిగిన భూముల విలువ నిలవాలన్నా, పెరగాలన్నా ప్రజలు ఉండాలి. ప్రజలు లేకపోతే భూముల విలువ పడిపోతుంది. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే అభివృద్ధి జరగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.