- బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు?
- కార్పోరేషన్లకు ఎందుకు నిధులివ్వలేదు?
- అబద్ధాలు చెప్పి పారిపోవడం సరికాదు
- వైసీపీ సభ్యులు సమాధానం చెప్పాలి
- మండలిలో బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
అమరావతి(చైతన్యరథం): వైసీపీ హయాంలో బీసీ విద్యార్థి అమర్‌నాథ్ గౌడ్, దళిత డ్రైవర్ హత్యపై వైసీపీ చర్చకు సిద్ధమా అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సవా ల్ చేశారు. 2014-19 మధ్య చేనేతలకు ఇచ్చిన హామీల విషయంలో శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ దుష్ప్రచారంపై మంత్రి లోకేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీ సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడి బయటకు వెళ్లిపోతారని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. 2014-19 పాలన గురించి మాట్లాడుతున్నారు. అమర్‌నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మాట్లాడదాం. బీసీ కుర్రోడిని ఎంత దారుణంగా చంపారో మాట్లాడదాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన అంశంపై మాట్లాడదాం.
ప్రతిపక్ష సభ్యులు సభలో దుష్ప్రచారం చేసి పారిపోవడం సరికాదు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేయలేదా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలని నిలదీశారు. వైసీపీ పాలనలో బీసీ కార్పోరేష న్లకు ఎందుకు నిధులు కేటాయించలేదని నిలదీశారు. గౌరవ బీసీ మంత్రి ప్రజలకు సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేనేతలను మోసం చేసిందని, నేతన్న ద్రోహి జగన్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ 8 నెలల పాలనలోనే చేనేతల అభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు.