- తీరు మార్చుకోకుంటే వైసీపీ భూస్థాపితమే
- నాడు అరాచకాలపై ఎప్పుడైనా స్పందించారా?
- వంశీని అప్పుడు రౌడీ, బకాసురుడు అన్నావ్
- నేడు ఆయనను మహాత్ముడిలా చూస్తున్నారా?
- మేనిఫెస్టోలో ఆ ప్రకటన చేసే దమ్ముందా?
- గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు
మంగళగిరి(చైతన్యరథం): జగన్‌రెడ్డి తీరు మార్చుకోకుంటే ప్రజలు వైసీపీని భూస్థాపి తం చేయడానికి సిద్ధంగా ఉన్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 23, 2018న బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మట్టి 1500 ఎకరాలు అమ్మారని వంశీని మట్టికాసురుడు, బకాసురుడు, రౌడీ అని విమర్శించిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు అదే వంశీని మహాత్ముడిలా చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ఫేక్ భూ పట్టాల కేసులో అప్పటి తహసీల్దారు పేరును జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే తొలగించలేదా? అదే తహసీల్దారును గన్నవరం ప్రధానమైన మండలంలో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించలేదా? అని దుయ్యబట్టారు. బూతులు తిట్టే వారికి మంత్రి పదవులు ఇచ్చి జగన్‌రెడ్డి ప్రోత్సహించలేదా? తెలుగు భాషపై దాడి చేసి ప్రజల తిరస్కరణకు గురై జగన్ 11 సీట్లకు పరిమితం కాలేదా? తన ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అరాచ కాలపై ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒక్కసారి అయినా స్పందించారా? చంద్రబాబు నుంచి బీ-ఫామ్ తీసుకుని ఎదిగిన వంశీ, కొడాలి నాని లాంటి వారిని చూసి బాబు గారు భయపడతారా? వృత్తి ధర్మం నిర్వహిస్తున్న పోలీసులను బెదిరించడం జగన్‌రెడ్డికి సమంజసమా? అంటూ ఆయన నిలదీశారు. పార్టీ మారారని కాసరనేని రంగబాబుపై దాడి చేసి ఆయన కాళ్లు విరగొట్టారు..మాదల శ్రీనివాసరావు షాపులు నేలమట్టం చేయిం చారు.. ఇలాంటి అరాచకాలపై జగన్ ఒక్కరోజైనా స్పందించారా? అని గుర్తు చేశారు. సీట్లు ఎక్కువ వస్తేనే అసెంబ్లీకి వస్తానని 2029 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని సవాల్ విసిరారు. జగన్‌రెడ్డి విధానాలు నచ్చకనే ప్రజలు వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని వ్యాఖ్యానించారు. జగన్ తన తీరు మార్చుకోకుంటే ప్రజలు వైసీపీని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, మంచిచెడు గుర్తించి మాట్లాడితే మంచిద ని హితవు పలికారు.