- ఇప్పటివరకు వచ్చిన వినతులు 19,403
- భూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం
- 1,012 సదస్సులకు 62,868 మంది హాజరు
- నాలుగోరోజు పాల్గొన్న మంత్రి సవిత, ఎమ్మెల్యేలు
అమరావతి(చైతన్యరథం): భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు పెద్దఎత్తున వినతులు/ఫిర్యాదులు వస్తు న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు 6వ తేదీన శుక్రవారం నుంచి ప్రారంభం కాగా జనవరి 8వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన వినతులను వెంటనే పరిశీ లించి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుల్లో తహసీల్దార్, ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉంటున్నారు. 8వ తేదీన మూడో రోజు నాటికి 695 సదస్సులు, 9వ తేదీన నాలుగోరోజు నాటికి మొత్తం 1,012 రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహించింది. ఇప్పటివరకు ఈ రెవెన్యూ సదస్సులకు 62,868 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ నాలుగురోజుల్లో మొత్తం 19,403 విన తులు స్వీకరించగా..170 సమస్యలకు ప్రభుత్వం తక్షణ పరిష్కారం చూపించింది. రెవె న్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన 19,403 వినతులు/ఫిర్యాదుల్లో హక్కుల రికార్డు ఆర్‌వోఆర్ (7207), అసైన్‌మెంట్ హౌస్ సైట్స్ (1116), ఏజెన్సీ ల్యాండ్ ప్రాబ్ల మ్స్ (872), అసైన్‌మెంట్ ప్రభుత్వ భూమి (751), రీసర్వే గ్రీవెన్స్ (710), బౌండరీ డెమాక్రేషన్ (658), రీసర్వే-ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ (416), ఎఫ్-లైన్ పిటిషన్స్ (319), 22ఏ భూములు (280), రెవెన్యూ గ్రీవెన్స్ (234), ఇతరమైనవి (6849) ఉన్నాయి. ఇక నాలుగో రోజు సోమవారం జరిగిన సదస్సుల్లో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం దొరసానిపల్లి గ్రామ రెవెన్యూ సదస్సులో బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవిత, ఎమ్మెల్యేలు ఎన్.వరదరాజులరెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. గోపాలపట్నం మండలం బుచ్చిరాజుపేట గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే గణబాబు, అనకా పల్లి జిల్లా పరవాడ మండలం బర్నికం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు.