- టూరిజానికి పరిశ్రమ హోదా కల్పించిన తొలి రాష్ట్రం
- పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు
- ప్రకృతి రమణీయ ప్రాంతాలకు రాష్ట్రం నెలవు
- ఏపీటీఏ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్‌లో మంత్రి కందుల దుర్గేష్
హైదరాబాద్ (చైతన్యరథం): ఏపీలో పర్యాటక, సినీ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, పర్యాటక అభివృద్ధిలో భాగంగా పీపీపీ విధానంలో ముందుకు వెళ్తున్నామని, ప్రతి పారిశ్రామికవేత్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపు ఇచ్చారు. హైదరాబాదులోని హైటెక్స్‌లో రెండు రోజులుగా జరుగుతున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఏపీటీఏ) కేటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ఆదివారం మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని వందలాదిగా తరలివచ్చిన పారిశ్రామికవేత్తలకు ఏపీ రాష్ట్ర నూతన టూరిజం పాలసీ 2024-29 వివరాలను వెల్లడిరచారు. ఏపీలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు
అందిస్తుందని వెల్లడిరచారు. ఏపీలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి.. ప్రభుత్వంతో కలిసి ఆలోచనలు పంచుకోండి.. సరైన ప్రతిపాదనలతో వస్తే తగిన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. త్వరితగతిన డీపీఆర్‌లు ఇస్తే, ఆచరణలో పెడదామని పారిశ్రామికవేత్తలకు మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఏపీలో పర్యాటక, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, తదితర అంశాలను వివరించారు. అంతేగాక ఏపీలో నూతన టూరిజం పాలసీ విధి విధానాలు, నూతన ఆవిష్కరణలను పారిశ్రామికవేత్తలకు మంత్రి దుర్గేష్ స్పష్టంగా వివరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత ఆరు నెలల్లో వివిధ రంగాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుందని, ప్రత్యేకించి పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.
పెట్టుబడులపై రాయితీలు
గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమ హోదా కల్పించారని, ఇది పర్యాటక రంగ వృద్ధికి శుభ పరిణామం అని పేర్కొన్నారు. తద్వారా పరిశ్రమలకు ఇచ్చే అన్ని రాయితీలు పర్యాటక రంగంలో అమలు చేస్తూ అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పటికే సంబంధిత జీవోను విడుదల చేశామని గుర్తు చేశారు. ఏపీ ఆర్థిక పురోభివృద్ధి సాధించేలా, ఉపాధి అవకాశాలు కల్పించేలా, సాంస్కృతిక వైభవాన్ని కొనసాగించేలా పాలసీ రూపొందించామని వెల్లడిరచారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టూరిజం సెక్టార్‌కు పరిశ్రమ హోదా కల్పించామని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే విజయవాడలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించామని, ద్వారా పారిశ్రామికవేత్తల అనుభవాలను, ప్రభుత్వ విధివిధానాలను పంచుకున్నామన్నారు.
సుస్థిర అభివృద్ధి ధ్యేయం
రాష్ట్రంలో ఒకే తరహా పర్యాటక అభివృద్ధి కాకుండా అడ్వెంచర్, ఎకో, విలేజ్, వెల్ నెస్, అగ్రి, బీచ్, హెరిటేజ్, టెంపుల్ తో పాటు క్రూయిజ్, కల్చరల్ టూరిజం తరహా పర్యాటక విధానాలు అమలు చేయాలని భావిస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక ప్రాంతంలో పర్యాటకుడు ఐదు రోజులు ఉండే విధంగా టూరిజం సర్క్యూట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి దుర్గేష్ బాధ్యతాయుతమైన పర్యాటకం, టూరిజంలో సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకులకు వసతి సామర్థ్యం పెంచే ప్రక్రియలో భాగంగా 50,000 హోటల్ గదులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. విశాఖపట్టణం, తిరుపతి, అరకు వ్యాలీ, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట ప్రాంతాల్లో యాంకర్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 25కు పైగా థీమాటిక్ సర్క్యూట్లు.. అందులో 2 బుద్దిస్ట్ సర్క్యూట్ లు, 10 టెంపుల్ సర్క్యూట్ లు, 5 బీచ్ సర్క్యూట్ లు, 4 రివర్ క్రూయిజ్ సర్క్యూట్ లు, 3 ఎకో టూరిజం సర్క్యూట్ లు, 2 సీ క్రూయిజ్ సర్క్యూట్ లు, సీప్లేన్ సర్క్యూట్ లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. విశాఖపట్టణం, శాలిహుండం, తొట్లకొండ, బొజ్జన కొండ, అమరావతి స్థూపం, ఉండవల్లి గుహలు, నాగార్జున కొండ తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు.
ప్రకృతి రమణీయతకు నెలవు
రాష్ట్రంలో విశాలమైన 974 కి.మీల సముద్రతీర ప్రాంతం, అద్భుతమైన ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని, ప్రత్యేకించి కోనసీమ, మారేడుమిల్లి లాంటి ప్రకృతి సౌందర్యంతో అలరారే చక్కటి ప్రదేశాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రసాద్, స్వదేశీ దర్శన్-2, శాస్కి పథకాల ద్వారా పర్యాటక అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. స్వదేశీ దర్శన్ ద్వారా అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణా నది ప్రాంతాల్లో విహారయాత్రలకు అనుకూలమైన వాతావరణం సృష్టించడం, పర్యాటకులను ఆకర్షించేలా రివర్ క్రూయిజ్ సర్క్యూట్ ల అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా సినిమా రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఏపీలో స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్ లు, తదితర మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలుపుదాం
గడిచిన 5 ఏళ్లలో ఏపీలో సరైన ప్రోత్సాహం, ప్రజల భాగస్వామ్యం లేక పర్యాటక అభివృద్ధి కుంటుపడిరదని, గత ప్రభుత్వంలో లోపభూయిష్ట విధానాలు, రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి జరగలేదని మంత్రి దుర్గేష్ వివరించారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. సుస్పష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తే దేశంలోనే ఏపీని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కారకులైన ప్రజలు స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు పారిశ్రామికవేత్తలకు ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం వచ్చిందని సంక్షేమంతో పాటు అభివృద్ధి సమపాళ్లలో జరుగుతోందని వివరించారు..
ఏ రాష్ట్రంలో లేని ప్రకృతి వనరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయని, అద్భుతమైన లొకేషన్లు ఆంధ్రప్రదేశ్ సొంతమని.. పెట్టుబడిదారులు ఇది గమనించి హోటళ్లు, రిసార్ట్లు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. బొర్రా కేవ్స్, బెలూం కేవ్స్, సిద్ధవటం కోట, గండికోట, తదితర ప్రాంతాల ప్రత్యేకతలను మంత్రి వివరించారు. సమర్థవంతమైన పరిపాలనా దక్షుడిగా, గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియా గా పేరొందిన సీఎం చంద్రబాబు నాయుడు, పేదల కంట కన్నీరు తుడిచే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆచరణలో చేసి చూపిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆపైన ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి పరుగులు పెడుతుందని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
`