వైసీపీ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం
మరమ్మతులు చేయలేదని మండిపాటు
అనకాపల్లి(చైతన్యరథం): జిల్లాలోని మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం జలహారతి కార్య క్రమం నిర్వహించారు. స్పీకర్ మాట్లాడుతూ నర్సీపట్నం, పాయక రావుపేట, కాకినాడ జిల్లా ప్రాంతాలకు తాండవ ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరు అందుతుంది. గత ప్రభుత్వ కాలంలో తాండవను నిర్లక్ష్యం చేశారు. 7 లక్షలతో గేట్లు మరమ్మతులు చేయలేకపోయా రని విమర్శించారు. ఈసారి వర్షపు నీటిని పూర్తిస్థాయిలో వినియో గించుకోవాలి. తాండవ జలాశయం ద్వారా సుమారు 51,465 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో అనకాపల్లి జిల్లాలో 32,689 ఎకరాలకు, కాకినాడ జిల్లాలో 18,776 ఎకరాలకు నీరు సరఫరా అవుతుంది.
హోంశాఖ మంత్రి అనిత ద్వారా రూ. 2.10 కోట్ల విపత్తు నివారణ నిధితో 18 అభివృద్ధి పనులు చేపట్టా రు. అదనంగా రూ.4.20 కోట్లతో 57 పనులు మంజూరై ఇప్పటి వరకు 30 పనులు పూర్తయ్యాయి. ఆయకట్టుకు 60 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది పలు పనులతో మొత్తం రూ.8 కోట్ల వ్యయంతో తాండవ ప్రాజెక్టు అభివృద్ధి జరి గింది. తాండవ జలాశయం పూర్తి సామర్థ్యం 4.96 టీఎంసీ కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 2.92 టీఎంసీ ఉంది. కాబట్టి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. నాతవరం నుంచి తాండవ జలాశయం వరకు సుమారు రూ.8 కోట్లతో రోడ్లు భవనాల శాఖ ద్వారా త్వరలో రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు.
రైతులకు అధిక ప్రాధాన్యం: అనిత
హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ తాండవ రిజ ర్వాయర్ నీటివిడుదల కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని తెలిపారు. గత ప్రభుత్వంలో తాండవ రిజర్వాయర్‌ను పట్టించు కోలేదు, గేట్ల మరమ్మతులు కూడా చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో రిజర్వా యర్ గేట్లను మరమ్మతులు చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. తుని, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల రైతులు దీనిపై ఆధారపడ్డారు. రైతుల కు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. పంటలకు గిట్టు బాటు ధర కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ జీవి వెంకటరమణ, తుని మార్కెట్ యార్డ్ చైర్మన్, జనసేన నియోజ కవర్గ ఇన్‌చార్జ్ సూర్యచంద్ర, నాతవరం మండల టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి రమణ, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.