- పక్కరాష్ట్రాల్లో అమ్మకాలు తగ్గాయి
- పేదలకు విషం పీడ విరగడైంది
- ఏపీలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం
- పిచ్చి బ్రాండ్లతో వైసీపీ దారుణంగా దోచుకుంది
- విషపూరిత మద్యంతో వేలాది ప్రాణాలు తీసింది
- నాటి నేటి మద్యం పరిస్థితిపై మంత్రి కొలుసు
మంగళగిరి (చైతన్య రథం): కూటమి ప్రభుత్వం తెచ్చిన ఉత్తమ మద్యం పాలసీతో పక్క రాష్ట్రాల్లో అమ్మకాలు తగ్గినట్టు ఆ రాష్ట్రాల్లోని అధికారులే చెబుతున్నారని సమాచార మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచారు. ఏపీలో నాణ్యమైన మద్యం దొరుకుతుండటంతో.. గత ప్రభుత్వంలోలా పక్క రాష్ట్రాల నుండి దొంగచాటుగా రాష్ట్రంలోకి మద్యం తెచ్చే పరిస్థితులు పోయాయన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి నాటి, నేటి మద్యం పరిస్థితిపై విశ్లేషణాత్మక సమాచారాన్ని వెల్లడిరచారు. ‘‘మద్యపాన నిషేధం చేస్తానన్న వైసీపీ.. అందుకు వ్యతిరేకంగా నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరకు అమ్మి వేల కోట్లు కొల్లగొట్టారు. కల్తీ మద్యంపోసి ప్రజల ధన మాన ప్రాణాలతో చెలగాటం ఆడారు. కమీషన్ల కోసం దేశంలో ఎక్కడాలేని బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చి దారుణంగా దండుకున్నారు. డబ్బుకోసం పేద ప్రజల ప్రాణాలను ఫణం పెట్టి అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డారు. వైసీపీ హయాంలో ఏదైతే బ్రాండ్‌లు తెచ్చారో.. ఆ బ్రాండ్‌ల మద్యం తాగి దాదాపు 30వేల మందికిపైగా మరణించారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇంత దారుణమైన పనికి దేశంలో ఏ ప్రభుత్వమూ ఒడిగట్టి ఉండదు. వైసీపీ సరఫరా చేసిన మద్యంలో ఆల్కహాల్‌తోపాటు విషపూరిత రసాయనాలు ఉన్నట్టు బయటపడిరది. గత ప్రభుత్వంలో ఎప్పుడూ వినని బ్రాండ్స్.. త్రిబుల్ ఎక్స్, త్రిబుల్ ఆర్, బూమ్ బూమ్‌లాంటి పిచ్చి బ్రాండ్లను తయారు చేసి ప్రజల ప్రాణాలు తీశారు. మద్యపాన నిషేధం చేయకపోగా.. ఉన్న ధరలను పెంచి పేదలపై ఆర్థిక భారాన్ని మోపారు. అధిక ధరలకు విషపూరిత రసాయనాలు అమ్మి.. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌ను తరిమేశారు. విషపూరిత మద్యం తాగలేక గంజాయికు బానిసై 1700 మందికి పైగా యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ జే`బ్రాండ్ మద్యం తాగిన యువత ఇప్పటికీ కిడ్నీ, లివర్ సమస్యలతో ఆసుపత్రులపాలై ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితులను అధ్యయనం చేసి.. పారదర్శకత, ప్రజల ఆరోగ్యం, సామాజిక బాధ్యత, నియంత్రణ విధానం లక్ష్యాల ఆధారంగా మంచి పాలసీని తీసుకొచ్చి నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా అంతర్జాతీయ బ్రాండ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో చాలా కుంభకోణాలు దేశంలో బయటపడ్డాయి. వాటన్నింటినీ తలదన్నేది ఏపీలో బయటపడిన లిక్కర్ స్కాం. విషపూరిత రసాయినాలు కలిసిన చీఫ్ లిక్కర్‌తో గత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంది. ప్రజల ప్రాణాలను, ప్రజల ఆరోగ్యాలను ఫణంపెట్టి సంపాదించిన సొమ్ముతో టన్నుల టన్నుల బంగారం కొనడం, విదేశాల్లో మైన్స్ వ్యాపారం చేయడం, దుబాయిలాంటి ప్రాంతాల్లో సెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడటం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పాల్పడ్డారు. వైసీపీ చేసిన పాపాలు నేడు ఆధునిక సాంకేతికత ద్వారా కుంభకోణాలుగా బయటపడుతుంది. ఢల్లీిలో జరిగిన స్కామ్‌కంటే పదిరెట్లు ఎక్కువ స్కాం ఏపీలో జరిగింది. ఈ స్కాం ద్వారా లూటీ చేసిన డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూశారంటే.. వారు ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా ఖూనీ చేశారో ప్రజలందరూ గమనించాలి.
దేశమంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెంచాలని మోదీ పిలునిస్తే.. గత ప్రభుత్వం మాత్రం నగదు రూపంలో మాత్రమే లావాదేవీలు జరిపింది. దేనికోసం? దోచుకోవడానికి కాదా? బయటపడుతున్న నగదు డంప్‌లను చూస్తుంటే.. దోపిడీ ఏవిధంగా ఉందో స్పష్టం అవుతుంది. ఎటువంటి రాజకీయ కక్షలు లేకుండా.. ఎటువంటి తప్పుజరగకుండా.. సాంకేతికతను ఉపయోగించుకొని సిట్ నిజాలను బయట పెడుతుంది. వైసీపీ నేతలు తాము చేసిన దోపిడీ నుండి ప్రజలను దారిమరల్చేందుకు యత్నిస్తున్నారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.