- ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తాం
- ఐటీబీ బెర్లిన్ 2025 సదస్సులో మంత్రి దుర్గేష్
- వివిధ దేశాల ప్రతినిధులకు సమగ్ర సమాచారం
- మూడోరోజు జర్మనీ పర్యటనలో బిజీబిజీ బృందం
జర్మనీ: ఏపీలో పర్యాటకం పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడిరచారు. భారతదేశంలో మరే రాష్ట్రానికి లేని విధంగా ఏపీలో జల, రోడ్డు, వాయు రవాణా సౌకర్యాలతో పాటు అందమైన సహజ సిద్ధ ప్రకృతి ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మూడో రోజు జర్మనీ పర్యటనలో భాగంగా గురువారం బెర్లిన్ సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ స్టాల్ వద్ద మంత్రి దుర్గేష్‌తో పాటు టూరిజం ఎండీ ఆమ్రపాలి వివిధ దేశాల ప్రతిని ధులకు రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. నూతన పర్యాటక పాలసీ, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచా రాన్ని తెలిపే పుస్తకాలను పంపిణీ చేశారు. మడ అడవులు, సుదీర్ఘ సముద్ర తీరం, చారిత్రాత్మక ప్రదే శాలు, కోటలు, దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలు, చల్లని ప్రదే శాలు, సజీవ నదు లు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ప్రఖ్యాతి పొందిన బౌద్దారామాలు సహా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్స్, వెల్‌నెస్ సెంటర్లు, బహుళ అంతస్తు హోటళ్లు, విభిన్న పర్యాటకానికి, అంతర్జాతీయ ప్రమాణా లతో కూడిన మౌలిక వసతులకు పెద్దపీట వేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసు కుంటుందని వివరించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన విషయాన్ని వివరిస్తూ నూతన పర్యాటక పాలసీ విధి విధానాలు, ఇన్వెస్టర్లకు అందించే రాయితీలు వెల్లడిరచి పెట్టుబడులను ఆహ్వానించారు.