- న్యాకో తాజా నివేదికలో 7వ స్థానం
- ఏపీ శాక్స్‌కు మంత్రి సత్యకుమార్ అభినందన
అమరావతి(చైతన్యరథం): దేశంలో హెచ్‌ఐవీ నియంత్రణలో ఏపీ ఎయిడ్స్ నియం త్రణా సంస్థ 7వ స్థానానికి చేరుకుందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ(నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్-ఎన్‌ఏసీవో) తాజా పనితీరు సూచీలో వెల్లడిరచింది. 2024 ఏప్రిల్-డిసెంబర్ మధ్య మెరుగైన పనితీరును కనబర్చడం ద్వారా 17వ ర్యాంక్ నుంచి పైకి ఎగబాకింది. హెచ్‌ఐవీ నియంత్రణలో ఏపీ కృషిని న్యాకో అభినందించింది. న్యాకో విడుదల చేసిన సూచీలో వివిధ ప్రమాణాల విషయంలో ఏపీ శాక్స్ సాధించిన ఫలితాలను న్యాకో వెల్లడిరచింది. ఈ కాలంలో ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ (టీఐ), లింక్ వర్కర్స్ స్కీం (ఎల్‌డబ్ల్యూఎస్) విషయంలో 100 శాతం ఫలితాలు సాధించిందని న్యాకో పేర్కొంది. టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ కింద ఏపీ శాక్స్ రాష్ట్ర వ్యాప్తంగా 96 ఎన్జీవోల ద్వారా మహిళా సెక్స్ వర్కర్స్ (ఎఫ్‌ఎస్‌డబ్ల్యు) వంటి అధిక ప్రమాదకర వ్యక్తుల సమూహాలను స్క్రీనింగ్ చేసిందని తెలిపింది. ఎయిడ్స్ ప్రభావిత వ్యక్తులు, వారికున్న పరిచయాలను గుర్తించడంతో పాటు ఎల్‌డబ్ల్యూఎస్ కింద ప్రతి జిల్లాలో 100 హైరిస్క్ గ్రామాలను గుర్తించి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడాని కి, మరింత వ్యాప్తి చెందకుండా ట్రాక్ చేయడానికి కృషి చేసిందని న్యాకో వెల్లడిరచింది. హై రిస్క్ గ్రూపులలో 96 శాతం మందికి ఎయిడ్స్ స్క్రీనింగ్ చేసి అనంతరం చికిత్స చేపట్టినట్లు తెలిపింది.
ఈ గ్రూపులలో 75 శాతం మంది గర్భిణులను పరీక్షించడంతో పాటు, హై రిస్క్ గ్రూపులలో 88 శాతం మందికి సిఫిలిస్ కోసం పరీక్షలు నిర్వహించిన ట్లు కూడా వివరించింది. గతేడాది ఏప్రిల్` డిసెంబర్ మధ్యకాలంలో ఏపీ శాక్స్ 90 శాతం నిధులను ఉపయోగించుకుందని, ఇది పనితీరు ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవ డానికి వీలు కల్పించిందని తెలిపింది. ర్యాంకుల కేటాయింపులో హెచ్‌ఐవీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని కూడా న్యాకో పరిగణనలోకి తీసుకుంది. ఖైదీల స్క్రీనింగ్‌ను మెరుగుపరచడంపై ఏపీ శాక్స్ ఇప్పుడు దృష్టి సారించింది. 2004 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 2,25,000 మంది హెచ్‌ఐవీ బాధితులను గుర్తించారు. హెచ్ ఐవీ నియంత్రణ కోసం 2024-25 సంవత్సరానికి ఏపీ శాక్స్‌కు రూ.127 కోట్లు న్యాకో ఇచ్చింది. లక్ష్యాలకు అనుగుణంగా వ్యాధిని నియంత్రించడంలో మంచి పనితీరు కనబర్చి నందుకు ఏపీ శాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.సిరి, సిబ్బందిని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకు మార్ యాదవ్ అభినందించారు.