ఢిల్లీ (చైతన్య రథం): వికసిత్ భారత్ ఆకాంక్షకు ఏపీ దోహదకారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 10వ వార్షిక సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు.. వికసిత్ భారత్ `2047 సాధనకు కీలకాంశాలను ప్రతిపాదించి ప్రధాని మోదీ ప్రశంసలందుకున్నారు. సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూఢల్లీిలో జరిగిన 10వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నాను. ఈ సమావేశం ‘విక్షిత్ రాజ్యం ఫర్ విక్షిత్ భారత్ `2047’ అనే అంశంపైనే కేంద్రీకృతమైంది. ఇది సంపన్నమైన, సమ్మిళితమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన భారత్‌కు ఒక దార్శనికత. సమావేశంలో `రాష్ట్రాభివృద్ధికి ఉపకరించే మూడు కీలక అంశాలను ప్రతిపాదించాను. పెట్టుబడులు, తయారీ, ఎగుమతులు, ఉద్యోగావకాశాల కల్పనకు లక్ష్యంగా పెట్టుకున్న పీపీపీ ప్రాజెక్టులకు కేంద్ర వయోబిలిటీ గ్యాప్ ఫండిరగ్‌కు మద్దతు ఇవ్వమని కోరాను.
పెట్టుబడులు, తయారీ, ఎగుమతులు, ఉద్యోగ సృష్టివంటి అంశాలపై దృష్టిపెట్టి, పీపీపీ ప్రాజెక్టులకు కేంద్రం వయబిలిటీ గ్యాఫ్ ఫండిరగ్‌కు మద్దతుగా ఉండటం ద్వారా జీడీపీ వృద్ధికి దోహదపడుతుందని ప్రతిపాదించాను. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా వృద్దుల శాతాన్ని తగ్గించుకునే అవకాశం ఉందని పేర్కొంటూ.. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు, మాతృత్వ సెలవులు పెంపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించాను. కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగంతో పాలనలో వేగం పెంచడమే కాకుండా, పౌర సేవలను విస్తృతం చేస్తున్న అంశాన్నీ ప్రస్తావించాను. ‘విక్షిత్ భారత్ `2047’ జాతీయ ఆకాంక్షకు గణనీయంగా దోహదపడటానికి ఏపీ కట్టుబడి ఉందని, అధిక నాణ్యత, మౌలిక సదుపాయాలు, సమానాభివృద్ధి, సాధికారత కలిగిన పౌరులతో.. 2047నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యాలను ప్రస్తావించాను. సాంకేతికత, సంక్షేమం, అట్టడుగుస్థాయి సాధికారతను సమగ్రపరిచే ధైర్యమైన, సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను అందించే స్వర్ణాంధ్ర`2047పై దృష్టిపెట్టిన విషయాన్ని చర్చించాను’ అని పేర్కొన్నారు.