- రాష్ట్రానికి 10 ఓడీ-ఓపీ అవార్డులు
- 7 చేనేత, హస్తకళల్లో.. రెండు సేద్యం రంగంలో
- రాష్ట్రాల విభాగంగా మరో అవార్డుకు ఎంపిక
- నేడు న్యూఢల్లీిలో అవార్డుల ప్రదానం
- మరిన్ని ఉత్పత్తులకు ఓడీఓపీ గుర్తింపునకు కృషి
- ఆగస్టునుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం
- అదే రోజు త్రిఫ్ట్ ఫండ్ నిధులూ విడుదల
- రాష్ట్రంలో మరిన్ని ఆప్కో షోరూమ్‌ల ఏర్పాటుకు కృషి
- రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి
పెనుకొండ/ సత్యసాయి (చైతన్య రథం): వన్ డిస్ట్రిక్ట్ `వన్ ప్రొడక్ట్ (ఓడీ `ఓపీ) కింద ఆంధ్రప్రదేశ్‌నుంచి తొమ్మిది ఉత్పత్తులకు అవార్డులు వచ్చినట్టు రాష్ట్ర చేనేత జౌళి మంత్రి ఎస్ సవిత తెలిపారు. తొమ్మిది ఉత్పత్తుల్లో ఏడు ఉత్పత్తులు చేనేత, హస్తకళలకు చెందినవి కాగా, రెండు వ్యవసాయ రంగానికి సంబంధించినవని వెల్లడిరచారు. వన్ డిస్ట్రిక్ట్ `వన్ ప్రొడక్ట్ విభాగంలో జాతీయస్థాయిలో మూడు రాష్ట్రాలు ఎంపికకాగా, అందులో ఏపీకి మరో అవార్డు వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తంచేశారు. పెనుకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతో రాష్ట్రంలో చేనేత పరిశ్రమ, హస్త కళలు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నాయన్నారు. అవార్డులు దక్కించుకున్న చేనేత, హస్త కళల ఉత్పత్తుల్లో విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ, అనకాపల్లి జిల్లా నుంచి ఏటికొప్పాక బొమ్మలు, కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్ శారీ, బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ, తిరుపతి నుంచి వెంకటగిరి శారీ, నర్సాపూర్ అల్లికల కుట్టు, సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు చీరలు ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగం నుంచి గుంటూరు మిర్చి, శ్రీకాకుళం నుంచి జీడిపప్పు ఎంపికయ్యాయన్నారు. ఓడీ ఓపీ విభాగంలో జాతీయస్థాయిలో ఏపీకి మరో అవార్డు వచ్చినట్లు తెలిపారు. ఏ విభాగంగా అవార్డు వచ్చిందో సోమవారం అవార్డుల ప్రదానోత్సవంలో ప్రకటిస్తారని మంత్రి వెల్లడిరచారు. న్యూఢల్లీిలోని భారత మండపంలో నిర్వహించే కార్యక్రమంలో ఓడీ-ఓపీ అవార్డులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అందజేయనున్నారన్నారు. ఈ అవార్డుల స్వీకరణకు తనతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, కళాకారులు ఆదివారం బయలుదేరి వెళుతున్నట్టు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్రానికి పది అవార్డులు రావడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని ఉత్పత్తలకు ఓడీ ఓపీ…
రాష్ట్రంలో మరిన్ని ఉత్పత్తులకు వన్ డిస్ట్రిక్ట్ `వన్ ప్రొడక్ట్ గుర్తింపు తీసుకురాడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడిరచారు. ఇదే విషయమై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారన్నారు. కడపలో అరటి, చిత్తూరు టమోటా, అనంతపురం వేరుశనగ ఉత్పత్తులను వన్ డిస్ట్రిక్ `వన్ ప్రొడెక్టు కింద ఎంపిక చేసేలా కృషి చేస్తున్నామన్నారు.
అవార్డులతో అమ్మకాలకు ఊతం
రాష్ట్రంలో ప్రతి జిల్లానుంచి ఓడీ `ఓపీ ఉత్పత్తుల ఉండేలా ప్రణాళికలు రచించినట్టు మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం చేనేత, హస్త కళాకారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఓడీ ఓపీ అవార్డులతో రాష్ట్రంలో చేనేత, హస్త కళలకు మరింత ప్రోత్సాహం లభించనుందన్నారు.ఈ అవార్డులు కళాకారుల్లో నూతన ఉత్సాహం తీసుకురావడంతో పాటు ఉత్పత్తుల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఓడీఓపీ అవార్డుల సాధన వెనుక సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు.
ఆగస్టునుంచి చేనేతలకు ఉచిత విద్యుత్
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా మగ్గాలున్న చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలున్న వారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించనున్నట్టు మంత్రి సవిత వెల్లడిరచారు. అదే రోజు త్రిఫ్ట్ ఫండ్ నిధులు కూడా విడుదల చేయనున్నామన్నారు. గడిచిన ఎన్నికల ముందు చేనేతలకు ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాటిచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయబోతున్నామన్నారు.
మరిన్ని ఆప్కో షోరూమ్‌ల ఏర్పాటు
చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సవిత తెలిపారు. ఇప్పటికే ఈ కామర్స్ ద్వారా చేనేత వస్త్రాల అమ్మకాలు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 97 ఆప్కో షోరూమ్ లున్నాయని, మరిన్ని షో రూమ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడిరచారు. ఆప్కో షోరూమ్‌ల ఏర్పాటుతో చేనేత ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశముందని, దీనివల్ల నేతన్నలకు ఆర్థిక భరోసా లభిస్తుందని మంత్రి సవిత తెలిపారు.