- ఆంధ్రప్రదేశ్ దేశానికే అన్నపూర్ణ
- ఏపీ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంది
- బెజవాడ దుర్గమ్మ దర్శనం సంతోషదాయకం
- ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ వ్యాఖ్య
- రాధాకృష్ణన్ కు ముఖ్యమంత్రి ఘన స్వాగతం
- ఘనంగా వీడ్కోలు పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్
విజయవాడ (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి పర్యటనకు వచ్చిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. మంత్రి కొలుసు పార్థసారథి, పాలకమండలి చైర్మన్ రాధాకృష్ణ తదితరులు.. ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. విజయవాడ రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని.. ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలుత గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు దంపతులు, ఐటీ మంత్రి లోకేశ్, ఇతర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఘనంగా వీడ్కోలు పలికిన గవర్నరు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ దర్శనం, విజయవాడ ఉత్సవ్ 2025 కార్యక్రమం ముగించుకుని తిరుపతికి తిరుగు ప్రయాణమైన భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ దంపతులకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎస్ అబ్ధుల్ నజీర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. బుధవారం సాయంత్రం 6:50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తిరుపతికి ప్రయాణమయ్యారు.
కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి, కార్మిక, కర్మాగారాల మంత్రి వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్, ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, రాజ్యసభ సభ్యులు సాన సతీష్, గుడివాడ, పామర్రు, పెడన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, జీ లక్ష్మిశ, జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు భారత ఉపరాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.