- గృహ నిర్మాణంపై సుర్బానా జురాంగ్ ఆసక్తి
- ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీకి ఎవర్సెండై ప్రతిపాదన
సింగపూర్: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు గ్లోబల్ అర్బన్ ఇన్‌ఫ్రా కంపెనీ సుర్బానా జురాంగ్ స్పష్టం చేసింది. సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధి చెర్ ఎక్లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టేందుకు ముందుకురావాలని సీఎం సుర్బానా సంస్థను ఆహ్వానించారు. ఏపీలో హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టులో భాగం కావాలని సీఎం సూచిం చా రు. సింగపూర్ హౌసింగ్‌లో 83 శాతం ప్రభుత్వమే చేపట్టిందని అధికారులు వివరించారు. హౌసింగ్ ఫర్ ఆల్ విధానంలో భాగంగా ఏపీలో సింగపూర్ మోడల్ హౌసింగ్ అంశంపై చర్చించారు. ఏపీలో, అమరా వతి లో ప్రభుత్వ హౌసింగ్ కార్యక్రమాలపై సుర్బానాతో భాగస్వామ్యం, సహకారంపై ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రధా నంగా దృష్టిసారించామని ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 20 పోర్టులు, 15 ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయని.. లాజిస్టిక్ హబ్‌గా ఏపీ తయారవుతుందని తెలిపారు. ఈ ప్రాంతాలను ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లుగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఆలోచనలను వారి ముందుంచారు. అమరావతిని భవిష్యత్ నగరంగా మార్చే క్రమంలో ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ కన్సెల్టెన్సీగా సుర్బానా జురాంగ్ పనిచేయనుంది. గతంలో రాజధాని అమరావతి కోసం సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్‌ను మరింత మెరుగుపరిచే అంశంపైనా చర్చించారు.
ఏపీలో పెట్టుబడికి ఎవర్సెండై ఆసక్తి
మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవ ర్సెండై కార్పొరేషన్ భెర్హాద్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తాన్‌శ్రీ ఏ.కె.నాథన్ ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక ఫాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పా టు అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీని విశాఖ లేదా కృష్ణపట్నంలో ఏర్పా టు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎవర్సెండై చైర్మన్ వివరించారు. దాదాపు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీ ర్ణంలో ఈ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఎవర్సెండై ప్రతిపాదించింది. ఈ కొత్త ఫ్యాక్టరీను వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంలో ఏర్పాటు చేసి దేశమంతటా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాల ను రవాణా చేసేందుకు వీలుగా ఎవర్సెండై ఆలోచన చేస్తోంది. ప్రతిపాదిత పెట్టుబడి ద్వారా రాష్ట్రానికి పరిశ్ర మల్లో వృద్ధి, ఉద్యోగావకాశాలు పెద్దఎత్తున వచ్చే అవకా శం ఉంది. అటు అమరావతి రాజధాని నిర్మాణంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ భాగస్వామ్యం అవుతామని ఎవర్సెండై ఆసక్తిని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీ సిటీ వంటి సంస్థలతో కలిసి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ సెంట ర్ స్థాపనపైనా ఎవర్సెండై చైర్మన్ ముఖ్యమంత్రితో చర్చించారు. గతంలో బుర్జ్ ఖలీఫా, పెట్రోనాస్ టవర్ సహా చెన్నైలోని డీఎల్‌ఎఫ్ డౌన్‌టౌన్ తారామణి ప్రాజె క్టు, గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫ్యాబ్రికేషన్ పనుల్లోనూ పాల్గొన్నట్టు ఎవర్సెండై వివరించింది.