అమరావతి (చైతన్యరథం): ప్రతిభ, అవకాశాల కేంద్రంగా ఏపీ అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. నాన్-మెట్రో నగరాలను హైలైట్ చేసే లింక్డ్‌ఇన్ సిటీిస్ ఆన్ ది రైజ్ నివేదికలో విశాఖ, విజయవాడకు స్థానాలు దక్కడం గర్వకారణం అని ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందించారు. ఆ నివేదికలో విశాఖపట్నం, విజయవాడ మొదటి, మూడవ స్థానాలను దక్కించుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. కొత్త నియామకాలు, ప్రతిభా ప్రవాహం, ఉద్యోగ మార్కెట్ విస్తరణ ఆధారంగా ఇచ్చే ఈ ర్యాంకింగ్‌లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మా కొత్త పారిశ్రామిక విధానాలకు లభించిన విజయంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, కాగ్నిజెంట్ క్యాంపస్‌లు, క్వాంటం వ్యాలీ, ఏఐ వర్సిటీలు ఏర్పాటు కానున్నాయి. ఐటీ, అధునాతన సాంకేతికతలకు దేశంలోనే ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించటంలో ఏపీ తన స్థానాన్ని మరింత సుస్థిరపరుచుకుంటోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.