- సంచార వాహనాలతో కౌన్సెలింగ్, పరీక్షలు
- ప్రారంభించిన వైద్యఆరోగ్య మంత్రి సత్యకుమార్
- వ్యాధితో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- ఏఆర్‌టీ చికిత్సతో జీవితాన్ని పొడిగించుకోవచ్చు
- వ్యాధిగ్రస్తులకు భరోసాగా రూ.4 వేల పెన్షన్
- ప్రజలలో అవగాహనకు ప్రభుత్వం చర్యలు
- స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములు కావాలి
అమరావతి(చైతన్యరథం): ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలను పట్టి పీడిస్తున్న హెచ్‌ఐవి నియంత్రణకు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సొసైటీ మరో ముందడుగు వేసింది. హెచ్‌ఐవీ వైరస్ ద్వారా వ్యాపించే ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ, వైద్య పరీక్ష సౌకర్యాలను మారుమూల ప్రాంత ప్రజల ముంగిటికి తీసుకెళ్లేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ సహకారంతో ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్, టెస్టింగ్ సంచార వాహనాలు ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ న్యాకో సహకారంతో కొనుగోలు చేసిన 10 కొత్త సంచార ఐసీటీసీ వాహనాలను విజయవాడ సిద్దార్ధ వైద్యకళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే వివిధ స్థాయిల్లోని వైద్యకేంద్రాలలో అందుబాటులో ఉన్న 16 ఐసీటీసీ వాహనాల ద్వారా హెచ్‌ఐవీ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోం దన్నారు. మారుమూల ప్రాంతాల్లో వారికి కూడా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేం దుకు ప్రభుత్వం మొబైల్ ఐసీటీసీ వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని వివరించా రు. పూర్తి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వాహనాల్లో వ్యాధి నిర్ధారణ కోసం మూడు వేర్వేరు కిట్లతో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపా రు.
సాధారణ వైద్యసేవలు అందుకునేందుకు వీలులేని మారుమూల ప్రాంతాల ప్రజలతో పాటు హెచ్‌ఐవీతో ప్రమాద స్థితిలో ఉన్న వారికి, జైళ్లలోని ఖైదీలు, ఇతర వర్గాలకు ఈ మొబైల్ ఐసీటీసీ వాహనాల ద్వారా కౌన్సెలింగ్‌తో పాటు పరీక్షలు చేస్తారని వివరించా రు. ఈ మొబైల్ కేంద్రాలలో డిఫరెన్షియల్ హెచ్‌ఐవీ స్క్రీనింగ్/పరీక్ష, కౌన్సెలింగ్, ఇం డెక్స్ పరీక్ష, సామాజిక, లైంగిక నెట్‌వర్క్ మ్యాపింగ్, పరీక్ష, స్క్రీనింగ్ సైట్‌లలో గుర్తిం చబడిన పెండిరగ్ హెచ్‌ఐవీ రియాక్టివ్ కేసుల హెచ్‌ఐవీ నిర్ధారణతో పాటు హెచ్‌ఐవీ, ఎస్‌టీఐ చికిత్స సేవలు, ఏఆర్‌టీ ప్రకారం మాత్రల పంపిణీ వంటి సేవలు అందించను న్నట్లు చెప్పారు. ఈ వాహనాల్లో ఒక కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్, అటెండెంట్లు సేవలు అందిస్తారని వెల్లడిరచారు. వీటి నిర్వహణకయ్యే వార్షిక వ్యయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. న్యాకో గ్లోబల్ ఫండ్ ఫర్ ఎయిడ్స్, టీబీ, మలేరియా కింద ఏపీిశాక్స్ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థద్వారా ఒక్కో వాహనం రూ.30.6 లక్షల వంతున మొత్తం 10 వాహనాలు కొను గోలు చేసినట్లు చెప్పారు. ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా ఆరు నెలల పాటు ఉచితంగా మందు లు, వైద్య చికిత్స అందుకున్న వారికి ప్రభుత్వం నెలకు రూ.4 వేల పెన్షన్ అందిస్తుందని తెలిపారు.
వారి వివరాలు ఏపీశాక్స్‌కు ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అవుతాయని, దాని ఆధా రంగా ప్రభుత్వం వారికి పెన్షన్ అందచేస్తుందని చెప్పారు. ఎయిడ్స్ నియంత్రణ కార్యక్ర మ వివరాల తాజా సమాచారం ప్రకారం దేశంలోని మొత్తం 25 లక్షలకు పైగా హెచ్‌ఐవీ కేసులు ఉండగా అందులో 2.22 లక్షల కేసులు మన రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు కలిగి ఉందన్నారు. అయితే హెచ్‌ఐవీ నియంత్రణ లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని..1998 నాటితో పోలిస్తే 2.4 శాతం మేర ఉన్న కేసులు క్రమంగా తగ్గించుకుంటూ ప్రస్తుతం వ్యాప్తి రేటు 0.62 శాతానికి నియంత్రించినట్లు చెప్పారు. హెచ్‌ఐవీ నియంత్రణలో ఏపీశాక్స్ మరింత చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి సూచించారు. హెచ్‌ఐవీ నియంత్రణకు సంబంధించి ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నా రు. వ్యాధి సంక్రమించినంత మాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదని, ఏఆర్‌టీ సెంటర్లలో మందులు తీసుకుంటూ జీవితాన్ని పొడిగించుకోవచ్చని తెలిపారు. సంక్రమిత (జణ) వ్యాధుల నుంచి మాత్రమే కాక అసంక్రమిత(చీజణ) వ్యాధుల నుంచి కూడా ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.
ప్రభుత్వ కృషిలో స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా భాగ స్వాములు కావాలని పిలుపునిచ్చారు. జీవన విధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవ టం ద్వారా రక్తపోటు, మధుమేహం బారిన పడకుండా రక్షణ పొందాలని సూచించారు. ఆర్థిక వనరుల లోటు ఉన్నా ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య రంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఏటా 70 వేల మంది క్యాన్సర్ బారిన పడగా 40 వేల మంది చనిపోతున్నారని దీనికి కారణం అవగాహన లోపమేనని తెలిపారు. 6 నెలల నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి ప్రభుత్వం 40 రకాల వైద్య పరీక్షలను నిర్వహించి వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుందన్నారు. ఈ కార్యక్ర మంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, ఏపీ శాక్స్ పీడీ ఎ.సిరి, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ పద్మావ తి తదితరులు పాల్గొన్నారు.