- భోజనం వడ్డించిన మంత్రి లోకేష్
- ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు
మంగళగిరి(చైతన్యరథం): దుగ్గిరాలలో అన్న క్యాంటీన్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రూ.61 లక్షల నిధులు వెచ్చించి అన్న క్యాంటీన్ నూతన భవనాన్ని నిర్మించారు. ముందుగా దుగ్గిరాల చేరుకున్న లోకేష్‌కు టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి అన్న క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్షయపాత్ర సిబ్బందితో కలిసి సామాన్య ప్రజానీకానికి భోజనం వడ్డించారు. ఈ కార్యక్ర మంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేసమనేని శ్రీ అనిత పాల్గొన్నారు.
రామాలయంలో ప్రత్యేక పూజలు
అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం యాదవపాలెం కోదండ రామచంద్రస్వామి మందిరాన్ని లోకేష్ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతి నేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షు రాలు కేశంనేని శ్రీ అనిత పాల్గొన్నారు.














