- వైసీపీ ఖాళీ అవుతుండటంతో పోలీసుల అండతో బీభత్సం
- టీడీపీ నేతల ఇళ్లలో తనిఖీల పేరిట హైడ్రామా
- బీరువాలు, లాకర్లు తెరిపించి దౌర్జన్యం
- ఇల్లంతా చిందరవందర చేసి మరీ సోదాలు
- చివరకు రిక్తహస్తాలతో వెనుదిరిగిన వైనం
నెల్లూరు:నెల్లూరులో జగన్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. జిల్లాలో వైకాపా నుంచి నేతలంతా బయటికి వస్తు న్న తరుణంలో పోలీసులను ఉపయోగిం చుకుని టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.భారీగా నగదునిల్వ చేశారంటూ నెల్లూరు నగరంలో తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణ సన్నిహి తుల నివాసాల్లో పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు.15మంది టీడీపీ నేతల ఇళ్లల్లో ఉదయాన్నే భారీసంఖ్యలో పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మాజీ జడ్పీటీసీ ముప్పాళ్ల విజేతారెడ్డి, వ్యాపారవేత్త గురుబ్రహ్మం, వారి సిబ్బంది, అనుచరులకు చెందిన నివాసాల్లో తనిఖీలు చేశారు. విజేత ఇంటిని 20మంది పోలీసులు చుట్టు ముట్టి హంగామా చేశారు. ఇంట్లో వస్తువులు, బీరువాలు. లాకర్లు తనిఖీ చేశారు.
తనిఖీల పేరిట ఇల్లంతా చిందర వందర చేశారు. రూ.25 వేలు నగదు తప్ప మరేమీ దొరక్కపోవడంతో వెనుదిరి గారు. పోలీసుల తనిఖీలు నేపథ్యంలో విజేతారెడ్డి నివాసం వద్దకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెళ్లారు. తెదేపా నేతల ఇళ్లలో పోలీసుల సోదాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. త్వరలో ఎన్నికల నోటి ఫికేషన్ ఉందని…అన్ని వ్యవస్థలు పార దర్శకంగా వ్యవహరించాలన్నారు. నెల్లూ రు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవటం తో, జగన్‌రెడ్డి పిచ్చి పీక్స్‌కి వెళ్ళిందని కోటంరెడ్డి అన్నారు. పోలీసులను ఉప యోగించుకుని టీడీపీ నేతలపై కక్ష సాధి స్తున్నాడని మండిపడ్డారు. ఎన్ని చేసినా, ఎన్నికల లోపే, ఒక్కో జిల్లాలో వైసీపీని ఖాళీ చేస్తా మనీ, ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తా మని చెప్పారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని… అన్ని వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహ రించాలని అన్నారు.