- వైసీపీని రాష్ట్రం నుంచి బాయ్ కాట్ చేయాలి
- ఆ పార్టీ నీచ సంస్కృతిని ఖండించాలి
- పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు
అమరావతి(చైతన్యరథం): అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా కుట్రలకు పాల్పడిన వైసీపీని రాష్ట్రం నుంచి బాయ్కట్ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే పెద్దల డైరెక్షన్తోనే వైసీపీ నేతలు ఇటువంటి చర్యలకు పాల్పడు తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ప్రభుత్వం మీద బుర ద జల్లడానికి ప్రయత్నించిన వైసీపీ నీచ సంస్కృతిని ప్రజా సంఘాలు, కుల సంఘాలు ముక్తకంఠంతో ఖండించాలి. కృరత్వ మే తప్ప మానవత్వం తెలియని నేతలు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని నాశనం చేసి నరరూప రాక్షసుల్లా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలను సభ్యసమాజం నుంచి వెలివేయాలి. రాజ్యాంగం అన్నా, ప్రజాస్వామ్యం అన్నా లెక్కే చేయని క్రూర స్వభావం ఉన్న జగన్రెడ్డి.. రాష్ట్రంలో ఉండటానికి అర్హుడు కాదు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం దళితుల మనోభావాలపై దాడి చేయడమే. ఇది దళితు లను అవమానించడమే. విగ్రహ ధ్వంసం కేసులో వైసీపీ నేతలు గోవిందయ్య, ఇతరులు స్వయంగా పట్టుబడి జైలుకు వెళ్లినా జగన్ రెడ్డి మౌనంగా ఉండటం దేనికి సంకేతం. దళితులంటే జగన్కు ఎందుకు అంత చిన్న చూపు. విగ్రహాలు పగలగొట్టడం, తగుల బెట్టడం, రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించేలా కుట్రలు చేయడం వైసీపీ నీచ రాజకీయ పేటెంట్. ఐదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి చేసిన ఒక్క మంచి పని లేదు.
ప్రజలు ఛీకొట్టి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొబెట్టినా బుద్ధి మారని జగన్.. సమాజంలో అశాంతిని రేకెత్తించేలా కుట్రలు పన్నుతున్నాడు. దళితులంటే జగన్కు గిట్టదు. సొంత పార్టీలో దళిత ఎమ్మెల్యేలు చెప్పులు లేకుండా జగన్ నివాసంలోకి రావాలి. కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ను హత్య చేశారు. దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణంను హత్య చేసి డోర్ డెలీవరీ చేశారు. దళితు డైన సింగయ్యపై జగన్రెడ్డే స్వయంగా కారు ఎక్కించి తొక్కించి చంపేశారు. ఇన్ని కుట్రలు దళితులపై ఎందుకు? ఇంకా ఎంత కాలం దళితుల పేరు చెప్పి కుట్ర రాజకీయాలు చేస్తావ్? ఐదేళ్ల వైసీపీ పాలనలో దళితులు మనశాంతిగా ఒక్కరోజూ గడపలేదు. ఏ రోజు ఏ కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తారో తెలియక భయ పడ్డారు. వైసీపీ హయాంలో 56 వేల మందికి దళితులపై దాడు లు, 192 మందిని హత్య చేశారని స్వయంగా రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. జగన్రెడ్డి పాలనంతా దళితులపై దాడులు, విధ్వంసాలే జరిగాయి. కూటమి ప్రభుత్వంలో ప్రశాంత వాతావర ణంలో ప్రజలు జీవనం సాగిస్తుంటే… అశాంతిని రేకెత్తించే విధంగా జగన్ కుట్రలకు తెరలేపుతున్నాడు. ప్రజలు ఇది గమనించాలి. జగన్రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని విధ్వంసాలు చేయాలని ప్రయత్నించినా తిప్పికొడతాం. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకొని హుందా రాజకీయాలు చేయాలని హితవు పలికారు.