ఢిల్లీ: రాజధాని అమరావతికి రుణం విడుదల, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై ఆయా సంస్థలతో ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ చర్చలు జరిపారు. దేశ రాజధాని ఢల్లీిలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ మంగళవారం హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ, జిందాల్ సా చైర్మన్ పృధ్వీరాజ్ జిందాల్‌తో సమావేశమయ్యారు. రాజధాని అమరావతికి రుణ సమీకరణ ప్రక్రియపై హడ్కో సీఎండీతో నారాయణ చర్చించారు. రాజధాని నిర్మాణానికి రూ.11వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఇప్పటికే హడ్కో అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై పృధ్వీరాజ్ జిందాల్‌తో నారాయణ చర్చించారు. ఇప్పటికే గుంటూరు, విశాఖలో 2 ప్లాంట్ల ఏర్పాటుకు జిందాల్ ఆమోదం తెలిపారు. వీటికి అదనంగా రాష్ట్రంలో మరిన్ని ప్లాంట్ల ఏర్పాటుపై జిందాల్‌తో నారాయణ చర్చలు జరిపారు