- భవిష్యత్తు తరాలకు స్థిరమైన వారసత్వం
- సీఐఐ సదస్సులో మంత్రి పొంగూరు నారాయణ
- పెట్టుబడిదారులకు రాజధాని నిర్మాణంపై ప్రజంటేషన్
విశాఖపట్నం(చైతన్యరథం): అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మి స్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం ద్వారా భవిష్యత్తు తరాలకు స్ధిరమైన రాజ ధానిని అందిస్తున్నామన్నారు. విశాఖలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్లీనరీ సెషన్‌లో స్థిరమైన నగరాలు – ఫ్రం విజన్ టు ఇన్వెస్ట్‌మెంట్స్ అనే అంశంపై మంత్రి ప్రసంగించారు. అమరావతి ప్రజా రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మిం చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను దేశవిదేశాల పారి శ్రామికవేత్తలకు వివరించారు. అటు అమరావతిపై నిపుణులతో పాటు పెట్టుబడిదారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అమరావతి ప్రజా రాజధాని 217 చ.కి.మీ విస్తీర్ణంతో దేశంలోని రాజధాని నగరాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది – దేశంలోని అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ పథకం (LPS)లో స్వచ్ఛందంగా పాల్గొన్న 29,000 కంటే ఎక్కువ మంది రైతుల నుంచి అమరావతి జన్మించిందన్నారు. అఖండ మద్దతు నుంచి జన్మించింది. అమరా వతిని ఆర్థికంగా, శక్తివంతమైన, పర్యావరణపరంగా స్థిరమైన, రాబోయే తరాలకు అవకాశాలను సృష్టించేలా నిర్మిస్తున్నామన్నారు.
2050 నాటికి 3.5 మిలియన్ల జనాభాతో 35 బిలియన్ డాలర్ల జీడీపీతో 1.5 మిలియన్ల ఉపాధి అవకాశాలు కల్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్ ప్లాన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అమరావతి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. సుమారు 90 కిమీ పొడవైన ఇన్నర్ రింగ్ రోడ్డు, 190 కిమీల మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే అనుమతి వచ్చింది. దేశంలోనే రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్ కేవలం 10 కిమీల మేర ఉండగా.. కొత్తగా నిర్మిస్తున్న హైదరాబాద్ – నంబూ రు రైల్వే లైన్ కేపిటల్ సిటీని ఆనుకుని వెళుతుందన్నారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌తో పాటు కొత్తగా మరో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మచిలీపట్నం పోర్టు కనెక్టవిటీ అమరా వతికి ఉంది. 30 శాతం బ్లూ -గ్రీన్ రాజధానిగా 7 సహజమైన ద్వీపాలు, 21 కి.మీ నదీ తీరం అమరావతిని అత్యంత అనుకూల వాతావరణం ఉన్న రాజధానిగా మారుస్తాయని వివరించారు.
నివాసయోగ్యమైన ప్రజారాజధాని
అమరావతిని నివాసయోగ్యమైన ప్రజా కేంద్రిత రాజధానిగా నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. 5-10-15 నిమిషాల నివాస యోగ్యంగా ప్రణాళికా బద్దంగా నిర్మాణం జరుగుతుందన్నారు. అమరావతిలో ఉండే ప్రజలు అత్యవసర సేవలకు 5 నిమిషాలు, వినోద ప్రదేశాలకు 10 నిమిషాలు, పని ప్రాంతాలకు 15 నిమి షాల్లో చేరుకునేలా నివాసయోగ్యంగా అమరావతి నిర్మాణం ఉం టుందన్నారు. 360 కి.మీ ట్రంక్ రోడ్లు, 1500 కి.మీ రోడ్డు నెట్వర్క్‌తో ట్రాఫిక్ సజావుగా సాగేలా ప్రణాళికలు రూపొందించి నట్లు చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ లైన్లు, కమ్యూనికేషన్ లైన్లు, ప్రణాళికాబద్ధమైన ఇం టర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌తో ఆర్థిక వృద్ధికి దన్నుగా అమరావతి ఉండనుంద న్నారు. మరోవైపు దాదాపు 91,000 కోట్లతో ప్రభుత్వ భవనాలు, రోడ్లు, మౌలిక వసతులు, వరద నివారణ పనులకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. రాబోయే మూడేళ్లలో 51,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేసేలా ఇప్పటికే టెండర్లు పూర్తి చేశా మని తెలిపారు. ఇలాంటి ప్రపంచ స్థాయి మౌళిక వసతులతో అమరావతి రాజధాని సుస్థిరమైన రాజధానిగా మారుతుందని చేశారు.
ఇప్పటికే అమరావతిలో 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని…విట్, ఎస్‌ఆర్‌ఎం వంటి విద్యాసంస్థలు, కిమ్స్, బసవతారకం వంటి ఆసుపత్రులు, హిల్టన్, మారియట్, నోవాటెల్ వంటి హోటల్స్, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టుబడు లకు ముందు కొచ్చాయన్నారు. రతన్ టాటా హబ్, క్వాంటం వ్యాలీతో బలమైన నాలెడ్జి సెంటర్‌గా అమరావతి మారనుంది. భాగస్వామ్య సదస్సతులో 40,000 కోట్ల పెట్టుబడులకు ఎంవో యూలు కుదిరాయన్నారు. అమరావతి ద్వారా రాజధాని నిర్మాణం మాత్రమే కాదు.. భవిష్యత్తు తరాలకు స్థిరమైన వారసత్వాన్ని నిర్మి స్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్, సీఐఐ ప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు పాల్గొన్నారు.













