అమరావతి (చైతన్యరథం): అమరావతి (చైతన్యరథం): ఆమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌ను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. గత నెల 30న విజయవాడలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో చేసిన డిక్లరేషన్‌కు ఆమోదం లభించింది. ఈ మేరకు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిని క్వాంటమ్ గేట్ వే హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌ను రూపొందించారు. క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడిరచారు. దేశంలోనే అతి పెద్ద క్వాంటమ్ బెడ్‌గా క్వూ-చిప్- ఇన్‌ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధే లక్ష్యమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడిరచింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.