- ఉద్ఘాటించిన సీఎం చంద్రబాబు నాయుడు
- సభ విజయవంతంపై అందరికీ ధన్యవాదాలు
అమరావతి (చైతన్య రథం): ప్రజా సహకారం, కేంద్రం మద్దతుతో ప్రజా రాజధాని అమరావతిని రాష్ట్రానికి చోదకశక్తిగా తీర్చిదిద్దుతానని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. రాజధాని అమరావతి పనుల పునప్రారంభ కార్యక్రమం విజయవంతమైన సందర్భంలో.. అందుకు సహకరించిన ప్రజలు, ప్రభుత్వాధికార్లు, భాగస్వామ్యపక్షాలకు సీపం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. ఈమేరకు శనివారం ఎక్స్ వేదికగా పోస్టుపెడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, భాగస్వామ్య పక్షాలు, సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ మీడియాకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. ప్రజా సహకారంతో, కేంద్ర పభుత్వ మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదకశక్తిగా నిలిచేలా భవిష్యత్ నగరంగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని సాధించి.. మాకు అండగావున్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని చెబుతున్నా. పజా కార్యక్రమం విజయవతమవ్వడం పట్ల ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.