సింగపూర్ (చైతన్యరథం): అయిదేళ్ల వైసీపీ విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, అందుకే ఏ దేశం వెళ్లినా ముఖ్యమంత్రి చంద్రబాబు, నేను తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నామని రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సింగపూర్‌లో తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలి. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్రం ఊపిరి తీసుకుంటోంది. ప్రధాని మోదీ త్వరలోనే సింగపూర్‌లో పర్యటిస్తారు. ఆ పర్యటనలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొని విజయవంతం చేయండి. రాష్ట్రానికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లను అభినందించిన లోకేష్ వారితో ఫోటోలు దిగారు.