పీ4తో పాఠశాలలను ఆధునికీకరిస్తాం
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
నెల్లూరులో వీఆర్‌సీ హైస్కూల్ పరిశీలన
నెల్లూరు(చైతన్యరథం): కార్పొరేషన్ పరిధిలోని 11 ప్రభుత్వ హైస్కూల్స్‌ను వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని హంగులతో సిద్ధం చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయ ణ తెలిపారు. నగరంలోని మూలాపేట బాలికల ఉన్నత పాఠశాల, వీఆర్‌సీ పాఠశాల, ఆర్‌ఎస్‌ఆర్ పాఠశాలను శనివారం ఆయన పరి శీలించారు. వీఆర్సీ తరహాలోనే పాఠశాలలను తీర్చిదిద్దుతామని వివరించారు. ముందుగా మూలాపేట బాలిక ఉన్నత పాఠశాలలో సీఎస్‌ఆర్ ఫండ్స్‌తో ఆధునికీకరణ పనులు చేపట్టిన డీఎస్‌ఆర్ కన స్ట్రక్షన్ అధినేత సుధాకర్‌రెడ్డితో మాట్లాడారు. శరవేగంగా జరుగు తున్న పనులను పరిశీలించారు. నూతన భవన నిర్మాణాలపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం వీఆర్‌సీ పాఠశాలలో కార్పొ రేషన్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. హైస్కూల్ నిర్వహణపై సూచనలు చేశారు. పాఠ శాల మెయింటెనెన్స్‌పై నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు.
విద్యారు ్థలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఎంపీ వీపీఆర్ దత్తత తీసుకున్న ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్ ఆధునికీకరణకు సిద్ధం చేసిన డిజైన్‌ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2014-19లో వీఆర్ హైస్కూల్‌లో ఇంటర్ విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. శిక్షణకు అయ్యే ఖర్చును కార్పొరేషన్ భరిం చింది..టీచర్లకు నెలకు ఆరు లక్షల జీతాలు నారాయణ గ్రూప్ చెల్లించింది..మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ, మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులతో అప్పటి మేయర్ అజీజ్ ర్యాలీ కూడా నిర్వహించారని గుర్తుచేశారు. అయితే తమ మీద కోపంతో వైసీపీ ప్రభుత్వం దానిని మూసేసిందని మండిపడ్డారు.
నగర నడిబొడ్డులోని స్కూల్‌ను కూడా మూసేశారని, దానిని పునః ప్రారంభిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అంత ర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసి మాట నిలబెట్టుకున్నామన్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు. పీ4 కార్యక్రమం ద్వారా అన్ని స్కూల్స్‌ను ఆధునికీకరిస్తామని చెప్పా రు. మూలాపేట బాలికోన్నత పాఠశాల, ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్స్‌ను డీఎస్సార్ బ్రదర్స్, ఎంపీ వేమిరెడ్డిలు అధుకీకరిస్తున్నారని.. మరి కొంతమంది కూడా ముందుకు వస్తున్నారని తెలిపారు. పేద పిల్లలకు విద్యనే ఆస్తిగా అందిస్తామని..
వేలాదిమంది నిరుపేద పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను ఉచితంగా అందించటమే లక్ష్యమన్నారు. నగరంలోని 11 హైస్కూళ్లను వచ్చే విద్యా సంవత్స రానికి సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లలో కార్పొరేషన్ పరిధిలోని అన్ని స్కూళ్ల రూపురేఖలు మారుస్తామని వివరించారు. ఈ కార్యక్ర మంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్, డీఈవో బాలాజీరావు, మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు, డివిజన్ కో క్లస్టర్ పోకల రవి, వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, యూనిట్ ఇన్‌చార్జి మహేష్, డీఎస్సార్ కనస్ట్రక్షన్స్ ఎండీ అనీల్‌రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ అన్నంగి ప్రసాద్, టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.