అమరావతి (చైతన్యరథం): విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడిరచారు. ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలనూ అందించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.