- వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవస్థల నిర్వీర్యం
- ప్రజలను మభ్యపెట్టడం ఇకనైనా మానుకోవాలి
- ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ
గుంటూరు(చైతన్యరథం): గుంటూరు తూర్పు నియోజకవర్గ అర్బన్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఉపాధ్యాయులతో శనివారం గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టబ óద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టూరిజం డెవలప్‌మెంట్ బోర్డ్ చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. చంద్రబాబు సమర్థవం తమైన పాలనకు మరింత మద్దతు ఇవ్వడానికి పట్టభద్రులు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపుని చ్చారు. నిరుద్యోగ యువత సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్యంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని కూటమి నేతలు, కార్య కర్తలకు సూచించారు. పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఆలపాటిని గెలిపించుకుందామన్నారు. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసినం దుకే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడటం ఇకనుంచైనా మానుకోవాలని హితవు పలికారు.
నేతలు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుని ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు. వ్యవస్థలను చక్కదిద్ది సీఎం చంద్రబాబు పాలనలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి తో పాటు విద్యారంగం బలోపేతానికి ఆయన కృషి ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉపాధి కల్పనే లక్ష్యంగా అనేక సంస్థలు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం చంద్ర బాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇప్పటికే 4 లక్షల మంది నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు ప్రభుత్వ పరంగా చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
పలు సంస్థలతో ఒప్పందాలు పరిశ్ర మల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనంతరం రాష్ట్రంలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్క ఆనంద్‌బాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు, గుంటూరు తూర్పు నియోజకవర్గం అబ్జర్వర్ రాఘవేంద్ర, బీజేపీ నాయకులు ఉమాశంకర్, డిప్యూటీ మేయర్ సాజిల, కార్పొరేటర్ సరిత, చిట్టిబాబు, యల్లావుల అశోక్, రైల్వే బోర్డు నెంబర్ అంగిరేకుల వర ప్రసాద్ యాదవ్, ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్, గుంటూరు పట్టణ నాయకులు, ప్రైవేట్ అధ్యాపకులు పాల్గొన్నారు.