- కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
- ఫిష్ ఆంధ్ర పేరుతో దోచుకున్న వైసీపీ ప్రభుత్వం
- విశాఖ తీరంలో సీ వీడ్ కేంద్రాల ప్రారంభ కార్యక్రమంలో మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
విశాఖపట్నం (చైతన్యరథం): రాష్ట్రంలో మత్స్యసంపద పెంచటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్,పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విశాఖలోని జాలరి ఎండాడలో సోమవారం ఉదయం సీి వీడ్ సెంటర్లను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కేరళ ప్రభుత్వ మత్స్య సంస్థతో సముద్ర నాచు అభివృద్ధి చేసే పక్రియలో ఒప్పందం కుదుర్చున్నామని తెలిపారు. విదేశాలలో సీ వీడ్ కు చాలా డిమాండ్ ఉందని, విశాఖ లో మూడు సీ వీడ్ సెంటర్లను ప్రారంభించిన తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 22 సీ విడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడిరచారు.
సముద్ర నాచు వల్ల 45 రోజుల్లోనే ఆదాయం వస్తుందన్నారు శ్రీకాకుళం జిల్లా లో మంగళవారం సీ విడ్ సెంటర్లు ప్రారంభిస్తానన్నారు. ఇదే సమయంలో కేజ్ కల్చర్ ద్వారా మత్స్య సంపదను అభివృద్ధి చేసుకోవచ్చు అన్నారు. కేంద్రం సహకారంతో రూ.150 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పరుస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర పేరుతో మొత్తం లూటీ చేశారని ,2019`2024 మధ్య కేంద్ర నిధులను వినియోగించుకోలేకపోయారని విమర్శించారు. ఆధునిక సాంకేతికత వినియోగించుకుని మత్స్యకారులు అభివృద్ధి చెందాలన్నారు. ట్రాన్స్ పౌండర్స్ ఉండటం వల్ల మత్స్య కారులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. నూతన పద్ధతుల వల్ల ఎక్కువ దూరం వెళ్ల వలసిన అవసరం లేకుండా మత్స్య సంపద దొరుకుతుందన్నారు. మత్స్యశాఖ అభివృద్ధి కి కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. సీ వీడ్ పెంపకాన్ని చిన్న పరిశ్రమగా అభివృద్ధి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.