`
విశాఖపట్నం (చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా ఏఐ ఆధారిత నైపుణ్య గణన ప్రారంభిస్తామని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జరిగే 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ప్రారంభమైనది. మొదటి రోజు Transforming Ideas into Global Impact: Accelerating Inclusive and Sustainable Innovation పేరుతో జరిగిన రెండవ ప్లీనరీ సెషన్లో మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సాంకేతిక ఆధారిత పాలన, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ, తదితర కీలక కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకమైన ఏఐ ఆధారిత స్కిల్ సెన్సస్ ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామన్నారు. కార్పెంట్రీ నుండి ఏఐ ఇంజనీరింగ్ వరకు అన్ని రంగాల్లోని నైపుణ్య లోపాలను ఈ వ్యవస్థ గుర్తించగలదని చెప్పారు.
ఒకే వాట్సాప్ నంబర్లో వెయ్యి ప్రభుత్వ సేవలు …..
రాష్ట్రం డిజిటల్ సేవల్లో సాధించిన పురోగతిని మంత్రి వివరిస్తూ ఒకే వాట్సాప్ నంబర్ ద్వారా సుమారు 1,000 ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. జెనరేటివ్ ఏఐ సహాయంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను మరింత అభివృద్ధి చేసి ప్రభుత్వ డేటా లేక్‌ను మరింత బలోపేతం చేయనున్నామని చెప్పారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐ పెట్టుబడిని డేటా సెంటర్ రంగంలో రాష్ట్రం ఆకర్షించిందని ఆయన ప్రకటించారు. డేటా సెంటర్ ఒక ఎకోసిస్టమ్‌కు కేంద్ర బిందువై, ఫైనాన్షియల్ సర్వీసెస్ నుండి జియో-టెక్ వరకు అత్యాధునిక సాంకేతికత అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
దేశానికి దారి చూపే రాష్ట్రం ఏపీ
భవిష్యత్తు సాంకేతికతను ఆంధ్రప్రదేశ్ ముందుండి నడిపించగల సత్తా ఉందని, ఇదే దేశానికి, ఆపై ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం అందించే స్కిల్‌ను మరే దేశం అందించలేకపోవడం మనకున్న అతిపెద్ద బలంగా పేర్కొన్నారు. సౌదీ అరేబియాతో పరస్పర పెట్టుబడులు, సాంకేతిక సహకారం కొనసాగించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. సహకారం అనేది ఇరువర్గాలకూ లాభదాయకంగా ఉండాలని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చలు మాత్రమే కాకుండా అర్థవంతమైన ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాలని అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సౌదీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అథారిటీ సీఈవో హెచ్.ఇ ఖలేద్ అల్కహతఫ్ మాట్లాడుతూ…..2028 నాటికి ప్రపంచ డేటా పరిమాణం 395 జటా బైట్స్‌కు చేరుకుంటుందని అంచనా అన్నారు. ఒక దశాబ్దం క్రితం ఎవరూ ఊహించలేని పరిస్థితి కానీ, నేడు ఆ పరిస్థితికి వచ్చామన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న డేటాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అటువంటి వారిదే భవిష్యత్తు అని అన్నారు.
ఏఐ సింగపూర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్, ఎన్యుఎస్ఏఐ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డా .మోహన్ కంకణహళ్లి మాట్లాడుతూ……కృత్రిమ మేధస్సు (ఏఐ) పునరుజ్జీవనం ప్రపంచవ్యాప్తంగా పరిశోధన, ఆవిష్కరణలకు అపూర్వ వేగాన్ని అందిస్తున్నదన్నారు. చీఖూAI ఇన్స్టిట్యూట్లో కోర్ ఏఐ తో పాటు, AI మోడల్ ఆధారంగా ఫైనాన్స్, సైన్స్, సస్టైనబిలిటీ వంటి రంగాల్లో 150 మందికి పైగా ప్రొఫెసర్లు పనిచేస్తున్నారని ఆయన వివరించారు. జశీంఎశీం వంటి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లు ఏఐ సహాయంతో శాస్త్రీయ పత్రాలు, డేటాను విశ్లేషించి పరిశోధన హైపోతెసిస్లను వేగంగా రూపొందిస్తున్నాయని, ఫీల్డ్స్ మెడల్ విజేత టెరెన్స్ టావ్ నేతృత్వంలో గణితశాస్త్రంలో కూడా ఏఐ కొత్త నిరూపణలు అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు. చీఖూ GRI ప్రోగ్రామ్ ద్వారా శాస్త్రీయ పరిశోధనలను స్టార్టప్‌లుగా మార్పు చేసే ప్రయత్నాలు వేగవంతమై, ఐదేళ్లలో 400 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఏర్పడ్డాయని తెలిపారు. భారత్`సింగపూర్ మధ్య కో`ఇన్నోవేషన్ ల్యాబ్స్, అకాడెమియా`ఇండస్ట్రీ భాగస్వామ్యాల ద్వారా ఏఐ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన సూచించారు.














