విశాఖపట్నం (చైతన్య రథం): ప్రతిష్టాత్మక బ్రూక్‌ఫీల్డ్ సంస్థ రాష్ట్రంలో 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రూక్‌ఫీల్డ్ మధ్య 12 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఒప్పందం కుదిరిందని రాష్ట్ర ప్రజలతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ ఒప్పందాల్లో క్లీన్ ఎనర్జీ పవర్డ్ 3 గిగావాట్ డేటా సెంటర్ మరియు రాష్ట్రవ్యాప్తంగా అదనపు క్లీన్-ఎనర్జీ ప్రాజెక్టులున్నాయి. బ్రూక్‌ఫీల్డ్ మాడ్యూల్ తయారీ.. దాని సరఫరా గొలుసు, గ్రీన్ మాలిక్యూల్స్, హాస్పిటాలిటీ, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, వాణిజ్య రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, పోర్టులు, మొబిలిటీ, లాజిస్టిక్స్ హబ్‌లు మరియు పారిశ్రామిక టౌన్‌షిప్‌లలో అవకాశాలనూ అన్వేషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కోసం వారి ప్రణాళికలపట్ల నేను సంతోషిస్తున్నాను. వారి దార్శనికతను వాస్తవంగా మార్చడానికి, అవసరమైన వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇస్తున్నాను’’ అని పేర్కొన్నారు.














