12.1.2025 ఆదివారం అవినీతి పుత్రిక సాక్షిలో మరో అబద్దాల దండకం రాశారు. ‘‘ఏడు మాసాలలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదు. పైగా అన్ని రంగాలలో వైఫల్యం! వాటినుంచి దృష్టి మళ్లించేందుకు నెలకొకసారైనా ఒక పెద్ద డైవర్షన్‌ను రంగంలోకి దించుతున్నా’’రని వర్ధెల్లి మురళి.. రాసిన అబద్ధమే ప్రతివారం మళ్లీమళ్లీ రాస్తున్నారు. జగన్ అవలక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి రాసిన అబద్ధమే వందసార్లు రాయడం సాక్షి నైజం. కొందర్ని కొంతకాలం మాత్రమే మోసం చేయవచ్చుగాని ఎల్లకాలం మోసం చేయడం సాధ్యంకాదని చరిత్ర రుజువు చేసింది. కుల, మత, ప్రాంతీయ చిచ్చుపెట్టి, కోడికత్తి శీనుతో లబ్ధి, వివేకాను హత్య చేయించి ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ అబద్ధాల హెడ్డింగ్‌లు పెట్టి, తునిలో కుట్రలు చేసి రైలు బోగీలకు మంటలుపెట్టి, వైఎస్ బిడ్డనంటూ సెంటిమెంట్ కొల్లగొట్టి అధికారం చేపట్టారు. చంద్రబాబు పాలనపై వ్యతిరేకత లేకపోయినా వైఎస్ బిడ్డకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు కొట్టేసిన విషయం ప్రజలకు తెలిసివున్నా.. దాన్ని పక్కనబెట్టి వైఎస్ అకాల మరణంతో ఏర్పడి ఉన్న సానుభూతితో, కేసీఆర్, బీజేపీ తోడ్పాటుతో 2019లో అధికారంలోకి వచ్చారుగాని.. చంద్రబాబు పాలనా వైఫల్యంతో కాదు.
తన గొప్పతనం వల్లే అధికారానికొచ్చానని, తన దోపిడీని, నేరాల్ని ప్రజలు ఎల్లకాలం గుర్తుపెట్టుకోరని జగన్ ముఠా భ్రమపడ్డారు. దోపిడీ డబ్బుతో, దౌర్జన్యాలు, అబద్ధాలతో 175/175 సీట్లు గెలుస్తామని విర్రవీగారు. నాయకులకన్నా ప్రజలు తెలివైనవాళ్లని మరిచారు. తండ్రి పాలనను అడ్డంపెట్టుకొని దోపిడీ, నేరాలు చేసిన పంథాలోనే ముఖ్యమంత్రిగా కూడా అలాగే చేశాడు. పది ఇచ్చి వంద కొట్టేసిన మోసకారితనాన్ని పేదలు అర్థం చేసుకున్నారు. అభివృద్ధిని విధ్వంసం చేసిన తీరును వ్యాపార, పారిశ్రామిక, మధ్యతరగతి ప్రజలు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. టెర్రరిస్టు పాలనను, ప్రకృతి వనరుల దోపిడి, ప్రభుత్వ ఖజానా దోపిడీని ప్రజాస్వామికవాదులు, ప్రతిపక్షాలు, ప్రజలు, మీడియా సంస్థలు, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు ప్రత్యక్షంగా చూశారు. ఒక్కఛాన్స్ ఇచ్చి మోసపోయామని, దోపిడీ… నేరాల పంథాను జగన్ విడనాడడని గ్రహించి ప్రజలు 11సీట్లకే పరిమితం చేశారు.
ఓటమిపై సరైన ఆత్మ విమర్శ చేసుకుంటే ఎప్పటికో ఒకప్పటికి బాగుపడతారు. అది చేయకుండా ఆత్మస్తుతి, పరనిందతో తిరిగి అధికారానికొస్తామనుకుంటే అది భ్రమే అవుతుంది. వైసీపీకి మనుగడ కూడా ఉండదు. దోపిడీ, నేరాలు, అబద్ధాలు, విధ్వేషాలపై ఆధారపడే నేతల భవిత `తాటాకుమంట లాంటిదే.
ఏడు మాసాలలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చలేదనేది అబద్ధం. జగన్ మొదటి ఏడు నెలల పాలనలో నవరత్నాల మేనిఫెస్టో హామీల్లో మూడు హామీలు మాత్రమే అమలు చేశారు. మద్యనిషేదం హామీపై మాట తప్పి మడమ తిప్పాడు. పైగా మద్యం రేట్లు విపరీతంగా పెంచి రూ.లక్ష కోట్ల పేదల సంపాదనను దోచుకున్నారు. నాశిరకం మద్యంపోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు చెడగొట్టారు. నాసిరకం మద్యం మహమ్మారికి 30వేల పేదల ప్రాణాలు పోయి.. మహిళలు మంగళసూత్రాలు మంటగలిశాయి. మొదటి ఏడు మాసాల్లో జగన్ పెంచిన పింఛను రూ.250 మాత్రమే. అందులోనూ అనర్హులైన వైసీపీవారికి పింఛన్లు ఇచ్చి నిజమైన పేదలకు పింఛన్లు ఇవ్వలేదు. చంద్రబాబు ఒకే దఫా రూ.1000ల పింఛన్ పెంచారు. జగన్ రైతు భరోసా రూ.12,500 ఇస్తానని హామీ ఇచ్చి దాన్ని రూ.7,500లకే కోత కోశారు. అమ్మఒడికి రూ.13 వేలు ఇచ్చి నాన్న బుడ్డిలో లక్ష కొట్టేశారు. డ్రైవర్లకు రూ.10 వేలు ఇచ్చి డీజిలు, పెట్రోల్ రేట్లు పెంచి, విపరీతంగా పోలీసు జరిమానాలు వేసి వారి వద్ద లక్షలు కొట్టేశారు. ఇలా నవరత్నాలను నవ మోసాలు చేశారు. జగన్ తన మేనిఫెస్టోలో అమలు చేసింది 15 శాతం మాత్రమే. పైగా అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమలాంటి 120 చంద్రన్న సంక్షేమ పథకాల్ని రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు రూ.లక్ష కోట్లు దారి మళ్లించారు. ఈ అన్యాయాల్ని ప్రశ్నించిన వందలాది పేదల్ని హత్య చేశారు. వేలాదిమందిని జైళ్లపాలు చేశారు. జగన్ పాలనా వైఫల్యాలు, దోపిడీల డైవర్షన్ కోసం చంద్రబాబును అక్రమ కేసుతో జైలు పాలు చేశారు. వివేకా గొడ్డలిపోటును డైవర్షన్ కోసం గుండెపోటు అని సాక్షి టీవీలో స్క్రోలింగ్ ప్రసారం చేశారు. చివరకు ‘నారాసుర రక్తచరిత్ర’ అని సాక్షిలో హెడ్ లైన్ పెట్టి అబద్ధాలు రాశారు. దోపిడీదారులకు, నేరస్తులకు, అసమర్థ పాలకులకు డైవర్షన్ రాజకీయాల అవసరం ఉంటుంది గాని, అభివృద్ధి.. సంక్షేమానికి, సమర్థ నాయకత్వానికి బ్రాండ్ అయిన చంద్రబాబుకు ఎందుకు ఉంటుంది?
గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాని దివాలా తీసినా, వ్యవస్థలన్నీ విధ్వంసమైవున్నా.. తన సమర్థత, ప్రతిష్ట, కఠోర కష్టంతో చంద్రబాబు పాతాళంలో ఉన్న పరిస్థితిని ఏడు నెలల్లోనే ఒడ్డుకు చేర్చారు. పింఛన్లు భారీగా పెంచారు. ఒకటవ తేదీనే జీతాలు ఇస్తున్నారు. అన్న క్యాంటీన్లు తిరిగి తెరిచారు. 90 లక్షలకుపైగా కుటుంబాలకు ఉచిత గ్యాస్ ఇచ్చారు. ధాన్యంకొన్న 24 గంటలల్లోనే నగదు జమ చేస్తున్నారు. జగన్ పెట్టివెళ్లిన అనేక బకాయిలు తీరుస్తున్నారు. పోలవరం, అమరావతి, రోడ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల నిధులు డైవర్షన్ చేయకుండా ఆ సంస్థలకే కేంద్ర నిధులు ఇచ్చారు. ఇలా ఏడు మాసాల్లోనే నాలుగు వందలకు పైగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ‘డైవర్షన్’ అవసరం ఎందుకుంటుంది? తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురి మరణాలకు చంద్రబాబు కారణమని ఆరోపణలు చేయడం దుర్మార్గం కాదా? అలా అయితే ఇసుక మాఫియా కోసం అన్నమయ్య ప్రాజెక్టులో గల్లంతై 33మంది, కచ్చులూరు బోటు ప్రమాదంలో 39మంది, విశాఖ గ్యాస్ లీక్ కారణంగా 13 మంది, జంగారెడ్డిగూడెం కల్తీ మద్యంతో 27మంది, తిరుపతి రుయా హాస్పిటల్‌లో గ్యాస్ సరఫరా వైఫల్యంతో 19మంది జగన్ పాలనలో మృతిచెందారు. వీటికి వర్ధెల్లి మురళి ఏం సమాధానం చెప్తారు?
గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జె సెంటర్