- యూనిట్ విలువ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ లబ్ధిదారులకు మేలు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ గిరిజనులు ఇంటి నిర్మాణాల్లో పడుతున్న కష్టాలు, ఆర్థిఖ ఇబ్బందులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.రాజబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 5.99 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు రూ.3,220 కోట్ల అదనపు ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం యూనిట్ విలువను కేవలం రూ.1.80 లక్షలుగా నిర్ణయించింది. గత ఐదేళ్లలో ఇంటి సామగ్రి, కూలీల ధరలు విపరీ తంగా పెరిగినందున లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయటానికి అప్పులు చేస్తు న్నారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా ఇంటి యూనిట్ విలువకు అద నంగా ప్రతి షెడ్యుల్ కులాల వారికి రూ.50 వేలు, వెనకబడిన తరగతుల వారికి రూ.50 వేలు, షెడ్యూలు తెగల వారికి రూ.75 వేలు, ఆదివాసీ గిరిజనులు (పీవీటీజీ)కు రూ.లక్ష చొప్పున అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. ఈ అదనపు ఆర్థిక సాయం నాలుగు విడతలలో అనగా బేస్‌మెంట్ స్థాయి, రూఫ్ లెవెల్ స్థాయి, స్లాబు స్థాయి, ఇల్లు పూర్తి దశలలో లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలకు నేరుగా ఆర్థిక సాయం జమ చేయటం జరుగుతుందని వివరించారు. ఈ సువర్ణ అవకాశాన్ని లబ్ధిదారులు వినియో గించుకుని సత్వరమే ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని కోరారు.