- వారివల్లే 43 ఏళ్లుగా ఆటుపోట్లు తట్టుకుని ఎగురుతున్న పసుపు జెండా
- పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
- ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
- వైసీపీ హయాంలోనే పొగాకు రైతులకు అన్యాయం
- ప్రకాశం జిల్లా మహానాడులో మంత్రి డోలా
ఒంగోలు (చైతన్యరథం): కార్యకర్తల త్యాగం, కష్టం వల్లే 43 ఏళ్ల నుంచి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా టీడీపీ జెండా ఎగురుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని బృందావన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రకాశం జిల్లా టీడీపీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డోలా మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అండగా ఉంటారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. పింఛన్ రూ 4 వేలకు పెంచాం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేశాం. ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. జూన్ లో తల్లికి వందనం పథకం అమలు చేస్తాం. జగన్‌లాగా ప్రజలను మోసం చేయం, అన్ని హామీలు అమలు చేస్తాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొగాకు రైతులకు ఎప్పుడూ అండగా నిలిచింది టీడీపీ ప్రభుత్వమే. 2016లో పొగాకు ధరలు పడిపోయిన సమయంలో నాడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో స్వయంగా పర్యటించారు. కేంద్రంతో మాట్లాడి మద్దతు ధర కల్పించారు. కేంద్రం క్వింటాకు రూ. 1500 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కలిపి నాడు రూ.2000 ఇచ్చాం. పొగాకు రైతుల సమస్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఒక కమిటీని నియమించారు. పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి డోలా స్పష్టం చేశారు.
“